Aashaadha Amavasya 2021: అషాడ అమావాస్య శుభ ముహుర్తం.. ఈరోజు ఏ దేవుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా..
మన హిందూ సంప్రదాయంలో ప్రతి రోజును ప్రత్యేకంగా ఎవరో ఒక దేవతలకు సమర్పిస్తుంటాము. అలాగే ప్రతి నెల వచ్చే అమావాస్య, పూర్ణిమలకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది.
మన హిందూ సంప్రదాయంలో ప్రతి రోజును ప్రత్యేకంగా ఎవరో ఒక దేవతలకు సమర్పిస్తుంటాము. అలాగే ప్రతి నెల వచ్చే అమావాస్య, పూర్ణిమలకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆషాడ మాసంలో కృష్ణ పక్షం, అమావాస్యను ఆషాడ అమావాస్య అంటారు. ఈ ఏడాది జూలై 9న అంటే ఈరోజు ఆషాడ అమావాస్య. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య ఆషాధి అమావాస్య లేదా హలహరి అమావాస్య అని కూడా అంటారు. వ్యవసాయం చేసే ప్రజలకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఈ పవిత్రమైన రోజున రైతులు తమ పొలాలు పచ్చగా ఉండాలని దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే నాగలి, వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు. ఈరోజున పూర్వీకులను తలచుకుని దానం కూడా చేస్తారు. . ఈరోజున పూర్వీకులను ఆరాధించడం వలన శాంతి, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతుంటారు.
శుభ ముహుర్తం… తేదీ.. జూలై 9 శుక్రవారం. ప్రారంభం.. ఉదయం 5.16. ముగింపు జూలై 10 ఉదయం 6.46 గంటలకు.
ప్రాముఖ్యత.. గరుడ పురాణం ప్రకారం ఆషాడ అమావాస్య రోజున ఉపవాసం పాటించేవారు.. వారి పూర్వీకులను ఆరాధించి.. దానం చేయాలి. ఇలా చేస్తే పాపాలు, దోషాలు తొలగిపోతాయి.
పూజా విధి.. * ఈరోజున ఉదయాన్నే స్నానం చేసి.. శుభ్రమైన బట్టలు ధరించి.. రావి చెట్టుకు పూజ చేయాలి. ఆ తర్వాత పూర్వీకులను ఆరాధించుకోవాలి. అనంతరం ఆహారం దానం చేయాలి. * అంతేకాకుండా.. ఈరోజు శివుడు, రావి చెట్టు, హనుమంతుడు, శని దేవుడికి పూజలు చేయడం మంచిది. * హిందూ విశ్వాసం ప్రకారం, గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి అనే ఐదు పంచాభూతాలకు అధిపతి అయిన శివుడిని ఆరాధించాలి.