Horoscope 9 July 2021: ఆడంబరాల కోసం అతిగా ఖర్చు చేయకండి.. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది..
Horoscope 9 July 2021: రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా మనం రోజు ప్రారంభించేటపుడు మంచి
Horoscope 9 July 2021: రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా మనం రోజు ప్రారంభించేటపుడు మంచి చెడుల గురించి తెలుసుకుంటే.. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుస్తుంది. అందుకోసమే జనాలు రాశిఫలాలను చూస్తుంటారు. ఈ నేపథ్యంలో జూన్ 9 న రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి: ప్రతి విషయాన్ని అతిగా ఊహించి బాధపడకండి. దైవప్రార్థన వల్ల మానసిక బలం. ఆదాయం పర్వాలేదు. ఆడంబరాల కోసం ఖర్చు పెట్టకండి. ప్రయాణాలను వాయిదా వేయండి. ఆఫీసు పనుల్లో నిర్లక్ష్యం వల్ల తప్పులు జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి. మీ కుటుంబ ఆర్థిక వ్యవహారాలలో కి వేరొకరిని రానీయకండి.
వృషభ రాశి: సహనంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక మార్గం వైపు ఆసక్తి చూపిస్తారు. మానసిక ఆరోగ్యం కోసం మెడిటేషన్ చేయండి. తోటి ఉద్యోగులతో సామరస్యంగా ప్రవర్తించండి. ఆదాయ వ్యవహారాలు మెరుగు పడతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి.
మిధున రాశి: దైవప్రార్థన వల్ల మానసిక బలం. పాతకాలపు చింతకాయ పచ్చడి ఆలోచనలను వదిలిపెట్టండి. పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. కొంతమంది ఉద్యోగ మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలం. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
కర్కాటక రాశి: వ్యాపారస్తులు ఆదాయ వ్యవహారాలపై జాగ్రత్త వహించండి. విదేశీ వ్యాపారం లాభం. కుటుంబ సభ్యులకు ఒక సమయం కేటాయించండి ముఖ్యంగా పెద్ద వారితో మాట్లాడటం మీకెంతో ఎనర్జీ. అతిగా తినడం వల్ల ఊబకాయం. టీవీ మొబైల్ లతో ఎక్కువ గడపటం వల్ల సమయం వృధా కావలసినంత ధనం చేతికందుతుంది.
కన్యారాశి: సహనం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఫిట్ నెస్ కోసం చేసిన ప్రయత్నాలు సఫలం. కావలసిన ధనం చేతికందుతుంది అవసరాలకు ఖర్చు పెడతారు. ఆఫీసులో పనులు సకాలంలో పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు. నూతన వ్యక్తుల పరిచయం అవుతారు. కొంతమంది ఉద్యోగం మార్పుకి ప్రయత్నాలు. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి.
సింహరాశి: అన్నివిధాలా అనుకూలమైన రోజు. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు లాభాలను వస్తాయి. కుటుంబ సభ్యుల కోసం కొంత సమయం కేటాయించండి. ముఖ్యంగా మీ భార్యతో మనసు విప్పి మాట్లాడండి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు
ధనుస్సు రాశి: ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆత్మవిశ్వాసానికి అతి విశ్వాసానికి తేడా గమనించండి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు పొందుతారు. కావలసిన ధనం చేతికందుతుంది సరైన పథకాల్లో పెట్టుబడులు పెట్టండి ఫిట్ నెస్ కొరకు చేసిన ప్రయత్నాలు సఫలం.
వృశ్చిక రాశి: ఆత్మవిశ్వాసము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖ వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. విదేశాలతో వ్యాపారం చేసే వారు జాగ్రత్త వహించండి. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.
తులారాశి: ఆదాయ వ్యవహారాలు మెరుగుపడతాయి దాని వల్ల మనశ్శాంతి. ఆడంబరాల కోసం ఖర్చు పెట్టకండి. అప్పు ఇచ్చే ముందు వారి స్థితిగతులను గురించి పూర్తిగా తెలుసుకోండి కొంతమంది ఉద్యోగ మార్పుకై ప్రయత్నాలు. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి ముఖ్యంగా పిల్లలతో గడపటం వల్ల ఎనర్జీ.
మకర రాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే ఆత్మవిశ్వాసము ధైర్యము పట్టుదల అవసరం. జరిగిపోయిన విషయాలను తలుచుకుని బాధ పడకండి దాని వల్ల సమయం వృధా కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. ఆఫీసు పనుల్లో అదనపు పని వలన అధిక శ్రమ. ప్రయాణాలలో డబ్బు వస్తువులు జాగ్రత్త.
కుంభరాశి: జరిగిపోయిన విషయాలను తలచుకోవడం వల్ల మానసిక అశాంతి. దైవ ప్రార్ధన వలన మానసిక బలం. పెద్ద వారి సలహాలు తీసుకోండి. కావలసినంత ధనం చేతికందుతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతారు. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చెయ్యాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. తోటి ఉద్యోగులతో సామరస్య ధోరణి వల్ల ఆహ్లాదకర వాతావరణం.
మీన రాశి: అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఈ రోజు మీ పనులను ఎంజాయ్ చేస్తారు. కావలిసినంత ధనం చేతికందుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు.