సర్వేశ్వరుడి భక్తులకు గుడ్ న్యూస్.. అమర్‌నాథ్‌ యాత్రకు గ్రీన్‌సిగ్నల్.. రిజిస్ట్రేషన్‌ ఎప్పట్నుంచి అంటే..?

శివరాత్రిరోజు సర్వేశ్వరుడి పూజించిన భక్తులకు గుడ్‌న్యూస్‌. మీరు చేసిన పూజలు ఫలించాయేమోగానీ.. మీకు ఆ భోలేనాథ్‌ దర్శన భాగ్యం లభించబోతోంది.

సర్వేశ్వరుడి భక్తులకు గుడ్ న్యూస్.. అమర్‌నాథ్‌ యాత్రకు గ్రీన్‌సిగ్నల్.. రిజిస్ట్రేషన్‌ ఎప్పట్నుంచి అంటే..?
Amarnath Yatra 2021
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 13, 2021 | 9:33 PM

శివరాత్రిరోజు సర్వేశ్వరుడి పూజించిన భక్తులకు గుడ్‌న్యూస్‌. మీరు చేసిన పూజలు ఫలించాయేమోగానీ.. మీకు ఆ భోలేనాథ్‌ దర్శన భాగ్యం లభించబోతోంది. అవును. అమర్‌నాథ్‌ యాత్రకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. గత ఏడాది కోవిడ్‌ వల్ల అమర్‌నాథ్‌ యాత్రకు అడ్డంకులు ఏర్పడ్డాయి. కానీ ఈ ఏడాది కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ ఉన్నా, భోళాశంకరుడిని దర్శించుకునే భాగ్యం కలుగుతోంది.

అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 28న ప్రారంభం అవుతుంది. అయితే, ఇందుకోసం మరికొద్దిరోజుల్లో.. అంటే ఏప్రిల్‌ ఒకటో తేదీన రిజిస్ట్రేషన్‌ ప్రారంభం అవుతుంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు చెందిన 446 శాఖల్లోనూ, జమ్ముకాశ్మీర్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌లకు చెందిన శాఖల్లోనూ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు.

కరోనా నిబంధనలను దృష్టిలో ఉంచుకుని అమర్‌నాథ్‌ యాత్రను చేపడతారు. మొత్తం 56 రోజులపాటు ఈ యాత్ర ఉంటుంది. రక్షాబంధన్‌ నిర్వహించే ఆగస్ట్‌ 22న అమర్‌నాథ్‌ యాత్ర ముగుస్తుంది. కరోనా వల్ల గత ఏడాది కేవలం సాధువులకు మాత్రమే ఈ యాత్రను పరిమితం చేశారు. మరోవైపు 2019లో మాత్రం ఉగ్ర ముప్పు వల్ల యాత్రను మధ్యలో, అంటే ఆగస్ట్‌ రెండో తేదీన రద్దు చేస్టున్నట్లు ప్రకటించారు.

2019లో 3లక్షల 42వేల మంది భక్తులు అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి భోలేనాథ్‌ను దర్శించుకున్నారు. ఈ ఏడాది ఎంతమంది సర్వేశ్వరుడిని దర్శించుకుంటారు.. ఎంతమందిని అనుమతిస్తారు.. అన్నది కొన్నిరోజుల్లో తేలిపోతుంది. కాగా కరోనా వ్యాప్తి మళ్లీ తీవ్రమవుతున్న సమయంలో భక్తులు స్వీయ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటివి తప్పనిసరిగా చేయాలి.

Also Read:

AP Corona: ఏపీలో మళ్లీ కరోనా కల్లోలం.. ముఖ్యంగా ఆ జిల్లాలో.. మళ్లీ రెడ్ జోన్లు ప్రకటించిన అధికారులు

Telangana: ఓ పురాతన గడీ నుంచి పట్టపగలు పెద్ద, పెద్ద శబ్ధాలు.. స్థానికులు వెళ్లి చూడగా షాక్…