Mahashivaratri: ఈ శివాలయం ప్రత్యేకతే వేరు.. అగ్నిగుండంలో ఆ రెండూ వేస్తే కోరిన కోరికలు తీరుతాయట..

Mahashivaratri: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రఖ్యాతిగాంచిన దేవాలయాలు ఉన్నాయి. ప్రధాన దేవాలయాలతో పాటు.. భక్తుల కోరికలు..

Mahashivaratri: ఈ శివాలయం ప్రత్యేకతే వేరు.. అగ్నిగుండంలో ఆ రెండూ వేస్తే కోరిన కోరికలు తీరుతాయట..
Wonder Gundam
Follow us

|

Updated on: Mar 13, 2021 | 7:23 PM

Mahashivaratri: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రఖ్యాతిగాంచిన దేవాలయాలు ఉన్నాయి. ప్రధాన దేవాలయాలతో పాటు.. భక్తుల కోరికలు తీర్చే భగవంతుడు ఈ దేవుడు అంటూ కొన్ని పేరుగాంచిన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఆ దేవాలయాలకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా తరలివస్తారు. కారణం ఆ దేవుడి పట్ల వారికున్న ప్రగాఢ విశ్వాసం. అలాంటి దేవాలయాల్లో అనంతపురం జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామంలో మానవ రూపంలో వెలసిన పరమేశ్వరుడి ఆలయాన్ని ప్రముఖంగా చెప్పుకొవాలి. మహాశివరాత్రి సందర్భంగా ఆ ఆలయంలో ఏటా అగ్ని గుండాలు నిర్వహిస్తారు. ఈ అగ్ని గుండం భక్తుల కోరికలు తీరుస్తుందని భక్తుల విశ్వాసం. పండించిన ధాన్యం, దూపం ఈ అగ్నిగుండంలో వేస్తే ఆ పరమ శివుడు తన భక్తుల కోరికలను నెరవేరుస్తాడట. పంటలు ఇంకా బాగా పడి మంచి దిగుబడి వస్తుందట. అలాగే దీర్ఘకాలిక రోగాలు కూడా నయమవుతాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.

దేశంలో మహాశివుడు ఎక్కడ చూసినా లింగాకారంలో దర్శనమిస్తాడు. కానీ, అనంతపురం జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామంలో మానవరూపంలో దర్శనమిస్తాడు. మహా శివరాత్రి మహాపర్వదినాన్ని పురష్కరించుకొని వారం రోజులపాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగ నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా.. మహాశివరాత్రి రెండో రోజున అగ్నిగుండాలు ఏర్పాటు చేస్తారు. వేలాదిమంది భక్తులు అగ్నిగుండంలో ధూపం వేసి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడి అగ్నిగుండంలో ధూపం వేయడానికి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. భక్తులు ఉపవాసదీక్షతో వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకొని ఉపవాస దీక్ష విడిచిపెడతారు.

ఇక ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన అగ్ని గుండంలో ధాన్యం, ధూపంవేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, రోగాలు నశించి పోతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. రైతులు తాము పండించిన పంటలో కొంత అగ్నిగుండంలో వేస్తే పంట రెట్టింపు అవుతుందని వారి ప్రగాఢ విశ్వాసం. కాగా, ఈ ఉత్సవాన్ని తిలకించడానికి కర్ణాటక నుండి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తారు.

Also read:

Summer Food: సమ్మర్ వచ్చేసింది.. శరీరాన్ని కూల్‌గా ఉంచుకోవాలంటే వీటిని తినాల్సిందే..

TRS mla Ramulu naik Clarification : తప్పు తప్పు.. నేను అలా మాట్లాడలే.., ఎమ్మెల్యే రాములు నాయక్ క్లారిఫికేషన్