Andhra Pradesh: సత్యదేవుడి కల్యాణానికి వేళాయే.. వారం రోజుల పాటు ఉత్సవాలు
సత్య దేవుడిగా పేరు గాంచిన అన్నవరం(Annavaram) సత్యనారాయణ స్వామివారి కల్యాణోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ...
సత్య దేవుడిగా పేరు గాంచిన అన్నవరం(Annavaram) సత్యనారాయణ స్వామివారి కల్యాణోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో వెల్లడించారు. ఏడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 11న ప్రారంభమయ్యే కల్యాణోత్సవాలు ఈ నెల 17న ముగుస్తాయి. మే 11 వ తేదీ సాయంత్రం 4 గంటలకు అనివేటి మండపంలో స్వామి, అమ్మవార్లను వధూవరులుగా ముస్తాబు చేస్తారు. 12న దివ్యకల్యాణ మహోత్సవం జరగుతుంది. ఆ రోజు రాత్రి 9.30 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలోని వేదికపై ఈ వేడుక నిర్వహిస్తారు. స్వామి, అమ్మవార్లను వివిధ వాహనాలపై ఊరేగించిన తర్వాత కల్యాణ తంతు ప్రారంభమవుతుంది. 13న రాత్రి 7 గంటలకు అరుంధతీ నక్షత్ర దర్శనం,14న మధ్యాహ్నం 2.30 గంటలకు మహదాశీర్వచనము, పండిత సదస్యం, పండిత సత్కారం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 15న సాయంత్రం 4 గంటలకు కొండ దిగువున గ్రామంలోని దేవస్థానం ఉద్యానవనంలో వనవిహారోత్సవం, రాత్రి 8.30 గంటలకు స్వామి, అమ్మవార్లకు వెండి రథంపై గ్రామోత్సవం. 16న ఉదయం 9 గంటలకు పంపా సరోవరంలో స్వామి, అమ్మవార్లకు శ్రీచక్రస్నానం, 17న రాత్రి 7.30 గంటలకు శ్రీపుష్పయాగ మహోత్సవంతో ముగియనున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా గతేడాది అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణం ఏకాంతంగా జరిగింది. మే నెల 21 నుంచి 27 వరకు కల్యాణ ఉత్సవాలు జరిగాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో కల్యాణ ఉత్సవాలకు భక్తులు ఎవర్నీ అనుమతించకుండా కేవలం కొద్ది మంది వైదిక బృందం, అధికారులతో ఆలయం లోపల ఉత్సవాలు నిర్వహించారు.
మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇదీచదవండి
Sri Lanka: శ్రీలంకలో తీవ్రరూపం దాల్చుతున్న నిరసనలు.. అల్లర్లలో అధికార పార్టీ ఎంపీ మృతి