Village Festival: కోర్కెలు తీరాలంటే దున్న పోతుతో తొక్కించుకోవాల్సిందే.. మన ఏపీలోనే వింత ఆచారం..!

Andhra Pradesh: సనాతన ధర్మం ప్రకారం హిందువులు కోట్లాది దేవతామూర్తులను పూజిస్తున్నారు. ఆది దేవుళ్లైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మొదలు, గ్రామ దేవతల వరకు రకరకాలు కొలుస్తుంటారు భక్తులు. ముఖ్యంగా భారతదేశంలోని

Village Festival: కోర్కెలు తీరాలంటే దున్న పోతుతో తొక్కించుకోవాల్సిందే.. మన ఏపీలోనే వింత ఆచారం..!
Devotional
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 01, 2022 | 6:00 AM

Andhra Pradesh: సనాతన ధర్మం ప్రకారం హిందువులు కోట్లాది దేవతామూర్తులను పూజిస్తున్నారు. ఆది దేవుళ్లైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మొదలు, గ్రామ దేవతల వరకు రకరకాలు కొలుస్తుంటారు భక్తులు. ముఖ్యంగా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ దేవతలను ప్రత్యేక పద్ధతుల్లో ఆరాధిస్తారు. పెద్ద పెద్ద జాతరలు నిర్వహిస్తారు. జంతు బలులు ఇస్తారు. గ్రామ దేవతల పూజా కార్యక్రమాలన్ని డిఫరెంట్‌గా ఉంటాయి. వింత వింత ఆచార సంప్రదాయాలు ఉంటాయి. అక్కడెక్కడో ఎందుకు.. మన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలోనూ గ్రామీణ దేవతలకు జాతరలు నిర్వహిస్తారు. యు.కొత్తపల్లి మండలం అమినాబాధ్ గ్రామంలో పోలెరమ్మ జాతరలో వింత ఆచారాం ఉంది. భక్తులు అక్కడ దున్నపోతుతో తొక్కించుకుంటారు. అలా దున్నపోతుతో తొక్కించుకుంటే.. కోరిన కోర్కెలను అమ్మవారు తీరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

అవును.. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం అమినాబాధ్‌ గ్రామంలో అంగరంగ వైభవంగా పోలెరమ్మ జాతర జరుగుతోంది. అయితే, ఈ జాతరలో వింత ఆచారం ఉంది. అమ్మవారిని కోరిన కోర్కెలు తీరాలంటే దున్నపోతుతో తొక్కించుకుంటారు భక్తులు. ప్రతి ఏటా కొత్త అమావాస్య ముందురోజు జరిగే పోలెరమ్మ జాతరలో ఈ వింత ఆచారం ఏళ్లుగా వస్తోంది. చిన్నలు, పెద్దలు, మహిళలు, యువకులు రోడ్డుపై వరుసగా బోర్లా పడుకుంటారు. వారి పై నుంచి అమ్మవారు పూనిన మహిళ.. దున్నపోతు దూడ పట్టుకుని తొకుక్కుంటూ వెళ్లారు. ఇది అక్కడి ఆచారం అని భక్తులు చెబుతున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచారం అని, గ్రామంలో ప్రతీ ఒక్కరు ఈ వేడుకల్లో పాల్గొంటారని గ్రామస్తులు చెబుతున్నారు.

Also read:

LSG vs CSK, IPL 2022: ఏం కొట్టారు సామీ.. ఉత్కంఠ పోరులో చెన్నైని మట్టికరిపించిన లక్నో సూపర్ జెయింట్స్..

Summer Alert: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త.. పిల్లలపై ఓ లుక్కేసి ఉంచండి.. లేదంటే పెనుముప్పు తప్పదు..!

Puzzle Picture: ‘దమ్ముంటే నన్ను కనిపెట్టండి’.. డాగ్ విసిరిన సవాల్.. ఆన్సర్ చెప్పే సత్తా మీలో ఉందా?

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?