Horoscope Today: ఈరోజు ఈ రాశివారు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (01-04-2022): . వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే  రోజులో ఏ పని చేయాలన్నా .. ఏ పనిని మొదలు పెట్టాలన్నా ఈ రోజు తమకు ఎలా ఉంటుందని మంచి చెడుల..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Surya Kala

|

Updated on: Apr 01, 2022 | 6:18 AM

Horoscope Today (01-04-2022): . వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే  రోజులో ఏ పని చేయాలన్నా .. ఏ పనిని మొదలు పెట్టాలన్నా ఈ రోజు తమకు ఎలా ఉంటుందని మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఏప్రిల్ 1వ తేదీ ) శుక్రవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు కీలక వ్యవహారాల్లో చంచలన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. ఆచితూచి  వ్యవహరించాలి. అస్థిర నిర్ణయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటారు.  కొందరి ప్రవర్తన మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడకుండా ఆచితూచి వ్యవహరించాలి. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. లక్ష్యాన్ని చేరుకునే విధంగా పనిచేస్తారు. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ప్రారంభించిన పనులను ముందస్తు ప్రణాళికతో శుభఫలాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో కొత్త కార్యక్రమాలు చేపడతారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. ఉత్సాహంగా ముందుకు సాగాలి. దైవారాధన వలన మేలు జరుగుతుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి అనుకూల సమయం. బంధు,మిత్రులు మీ మాటకు విలువ ఇస్తారు. ఆర్థికంగా మేలు జరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు కొన్ని వ్యవహారాల్లో  ఊహించని శుభఫలితాలు వెలువడతాయి. చేపట్టిన పనులను పూర్తి చేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. కలహాలకు దూరంగా ఉండాల్సి ఉంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు అవసరానికి చేతికి డబ్బులు అందుకుంటారు. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఓర్పుగా నడుచుకోవడం వలన ప్రశంసలు లభిస్తాయి. సూర్యుడిని ఆరాధిస్తే మంచిది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా చేయాల్సి ఉంటుంది. కొన్ని కీలక పనులను పూర్తిచేస్తారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో కలిసి సంతోషకరంగా గడుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఉత్సాహాన్ని ఇచ్చే వార్త వింటారు. అధిక ఖర్చులు కాకుండా చూసుకోవాలి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. బంధు, మిత్రులతో కలిసి  విందు, వినోద  కార్యక్రమాల్లో పాల్గొని సంతోషంగా గడుపుతారు.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభఫలితాలను అందుకుంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు మిత్రుల సహకారంతో పనుల్లో ఆటంకాలు కల్గకుండా పూర్తి చేస్తారు. అనవసర ఒత్తిడి తగ్గించుకోవడం మేలు. కొత్తగా చేపట్టిన పనుల విషయంలో కుటుంబ సభ్యుల సలహాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు తీసుకునే సందర్భోచిత నిర్ణయాలు లాభాలు పొందుతారు. అవసరానికి తగిన సహాయం అందుకుంటారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడతాయి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

కోర్కెలు తీరాలంటే దున్న పోతుతో తొక్కించుకోవాల్సిందే.. మన ఏపీలోనే వింత ఆచారం..!

యాదాద్రి కొండపైకి ఆ వాహనాలకు నో పర్మిషన్.. కీలక నిర్ణయం తీసుకున్న ఈవో..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..