Summer Alert: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త.. పిల్లలపై ఓ లుక్కేసి ఉంచండి.. లేదంటే పెనుముప్పు తప్పదు..!
Summer Effect: అసలే వేసవి కాలం.. అందులోనూ ఒంటిపూట బడులు.. చాలా మంది పిల్లలు సరదాగా ఆడుకోవడం బావులు, చెరువులు, నీటి కుంటల వద్దకు వెళ్తుంటారు. అయితే, ఈ సరదానే వారి ప్రాణాలను బలితీసుకుంటుంది.
Summer Parents Alert: అసలే వేసవి కాలం.. అందులోనూ ఒంటిపూట బడులు.. చాలా మంది పిల్లలు సరదాగా ఆడుకోవడం బావులు, చెరువులు, నీటి కుంటల వద్దకు వెళ్తుంటారు. అయితే, ఈ సరదానే వారి ప్రాణాలను బలితీసుకుంటుంది. చాలా మంది పిల్లలు ఈత రాకున్నప్పటికీ.. సరదాగా వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈత వచ్చిన పిల్లలు సైతం చెరువులు, బావులు, కుంటల్లో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కోకొల్లలుగా చూశాం. ఈ నేపథ్యంలోనే పిల్లల తల్లిదండ్రలు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. పాఠశాల అయిపోయిన తరువాత పిల్లలు ఇంటికి వచ్చారా? ఎటైనా వెళ్లారా? అనేది పరిశీలించుకోవడం మంచిది. ఒంటరిగా చిన్న పిల్లలను చెరువులు, బావులు, కుంటల వైపునకు వెళ్లకుండా జాగ్రత్త పడండి.
వేసవి ఎండలు ముదురుతుండటంతో.. తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం వరకే స్కూళ్లు బంద్ అవుతున్నాయి. దాంతో పిల్లలు సరదా కోసం, చల్లదనం కోసం చెరువులు, బావులు, నీటి కుంటల వద్దకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉంటుంది. ఈత రాని పిల్లలు ఈత నేర్చుకోవడం కోసం తోటి స్నేహితులతో కలిసి వెళ్తుంటారు. పెద్దలు లేకుండానే చిన్న పిల్లలే ఒంటరిగా వెళ్తారు. అయితే, ఒక్కోసారి పిల్లలు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని.. పిల్లల తల్లిదండ్రులను టీవీ9 ముందుగానే అప్రమత్తం చేస్తోంది. పెద్దలు వెంట లేకుండా పిల్లలను ఎక్కడికి పంపించకండి. ముఖ్యంగా నది కాలువలు, వరద కాలువలు, నీటి కుంటలు, చెరువులు, బావుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ పిల్లలు ఈత నేర్పించాలనుకుంటే.. పెద్దల సమక్షంలో ఆ ప్రయత్నం చేయడం ఉత్తమం. కొందరు పిల్లలు సరదా కోసం అని ఇంట్లో చెప్పకుండానే వెళుతుంటారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండి.. ఈ వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోండి. గతంలో చోటు చేసుకున్న సంఘలను యాదిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు పాటించండి.
Also read:
Puzzle Picture: ‘దమ్ముంటే నన్ను కనిపెట్టండి’.. డాగ్ విసిరిన సవాల్.. ఆన్సర్ చెప్పే సత్తా మీలో ఉందా?