AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka High Court: భార్య అలా కోరడం తప్పేం కాదు.. విడాకుల కేసులో సంచలన తీర్పు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు..!

Karnataka High Court: ఓ జంట విడాకుల కేసులో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్య సపరేట్ ఇల్లు కోరడం, తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లడం తప్పేం కాదని స్పష్టం చేసింది. ఈ కారణాల చేత భార్యాభర్తలకు విడాకులు

Karnataka High Court: భార్య అలా కోరడం తప్పేం కాదు.. విడాకుల కేసులో సంచలన తీర్పు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు..!
Divorce
Shiva Prajapati
|

Updated on: Mar 31, 2022 | 6:47 PM

Share

Karnataka High Court: ఓ జంట విడాకుల కేసులో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్య సపరేట్ ఇల్లు కోరడం, తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లడం తప్పేం కాదని స్పష్టం చేసింది. ఈ కారణాల చేత భార్యాభర్తలకు విడాకులు మంజూరు చేయలేమంటూ కింది కోర్టు మంజూరు చేసిన విడాకులను రద్దు చేసింది. వివరాల్లోకెళితే.. 2002లో మహిళను వివాహం చేసుకున్న కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి తమ పెళ్లిని రద్దు చేయాలంటూ బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. పెళ్లి జరిగిన వెంటనే తన భార్య ప్రత్యేక ఇల్లు కావాలని కోరిందని తన పిటిషన్‌లో వ్యక్తి పేర్కొన్నాడు. తనకు వితంతువు అయిన తల్లి, తమ్ముడు ఉన్నందున తన భార్య కోరికను తిరస్కరించినట్టు ఆ వ్యక్తి చెప్పాడు. అంతేకాకుండా పిటిషనర్ తన భార్య, తన తల్లితో తరుచూ గొడవ పడేదని, తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోతుండేదని పేర్కొన్నాడు.

2007 జనవరిలో తన భార్య తనను, తన బిడ్డను విడిచిపెట్టి వెళ్లిపోయిందని, మళ్లీ తిరిగి రాలేదని ఆ వ్యక్తి తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. తన భార్య ప్రవర్తన కారణంగానే తన జీవితం దుర్భరంగా మారిందని, ఈ కారణాలతో తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోరాడు. ఆ వ్యక్తి వాదనతో ఏకి భవించిన ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే ఈ విడాకులపై ఆయన భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన కర్ణాటక హైకోర్టు పిటిషనర్ చెప్పిన కారణాలతో విడాకులు కోరడం సరికాదని, ఆ డైవర్స్‌ను రద్దు చేసింది. ప్రత్యేక ఇల్లు అడగడం, తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడం క్రూరత్వం కిందకు రాదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కారణాలతో భర్తకు ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను కూడా రద్దు చేసింది. ఈ కేసులో జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎస్ విశ్వజిత్ శెట్టితో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

ఇదిలా ఉండగా ఆ మహిళ తన భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసులు కూడా పెట్టింది. ఐపీసీ సెక్షన్లు 498 ఏ, 323, 504, 506, వరకట్న నిషేధ చట్టం, 1961లోని సెక్షన్లు 3, 4 కింద కూడా కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో వారు నిర్దోషులుగా తేల్చింది కోర్టు.

Also read:

Nizamabad Politics: నమ్మి ప‌ద‌విస్తే అధికార పార్టీకే ఎసరు.. ఎమ్మెల్యేలకు పంటికింద రాయిలా మారిన నేత!

LSG vs CSK Live Score, IPL 2022: ఐపీఎల్‌లో ఆసక్తికర పోరు.. లక్నో, చెన్నైల మధ్య కీలక మ్యాచ్‌..

Kejriwal: దేశం కోసం నా ప్రాణమైనా ఇస్తా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సెన్సేషనల్ కామెంట్స్