Kejriwal: దేశం కోసం నా ప్రాణమైనా ఇస్తా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సెన్సేషనల్ కామెంట్స్
దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ(BJP).. దాడులకు పాల్పడుతూ సమాజానికి ఏం సందేహం ఇవ్వాలనుకుంటోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన నివాసం ఎదుట...
దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ(BJP).. దాడులకు పాల్పడుతూ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన నివాసం ఎదుట ఆందోళనకారులు చేపట్టిన విధ్వంసంపై ఆయన స్పందించారు. ఈ దేశం కోసం తాను చావడానికైనా సిద్ధంగా ఉన్నానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యం కాకపోవచ్చు. కానీ, దేశం ముఖ్యం అన్న ఢిల్లీ(Delhi) సీఎం.. ఇలాంటి దౌర్జన్యాలతో భారత్ అభివృద్ది చెందదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించేందుకు దౌర్జన్యమే సరైన మార్గమేమో అనే భావన ప్రజల్లో వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్‌ఫైల్స్ సినిమాకు రాయితీలు ఇవ్వాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. దానికి అరవింద్ కేజ్రీవాల్ గతంలో కౌంటర్ ఇచ్చారు. సినిమాకు రాయితీలు ఎందుకు? యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే, అందరూ చూస్తారు కదా అని తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు.
ఈ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి కేజ్రీవాల్‌పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాపై అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలకు నిరసనగా, తాజాగా ఆయన నివాసాన్ని చుట్టుముట్టేందుకు బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. ముఖ్యమంత్రి నివాసం ముందు ఉండే బారికేడ్లను బీజేపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించలేని భారతీయ జనతా పార్టీ, ఆయనను చంపాలని కుట్ర చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత మనీశ్ సిసోడియా ఆరోపించారు. తాజాగా ఈ ఘటనపై కేజ్రీవాల్ స్పందిస్తూ బీజేపీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మరోవైపు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు దాడి ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని కోరుతూ ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశారు.
Also Read
Mahesh Babu : మహేష్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. ‘సర్కారు వారి పాట’లో అదే హైలైట్.?
Road Accident: రక్తమోడిన రహదారులు.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మిలటరీ జవాన్ సహా నలుగురు మృతి
Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 115, నిఫ్టీ 34 పాయింట్ల డౌన్..