ఇకపై స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవచ్చు.. మాస్కులు ధరించడం తప్పనిసరి కాదు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
మహారాష్ట్రలో(Maharashtra) రేపటి నుంచి మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరాఠీ నూతన సంవత్సరం అయిన గుడిపడ్వా సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని...
మహారాష్ట్రలో(Maharashtra) రేపటి నుంచి మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరాఠీ నూతన సంవత్సరం అయిన గుడిపడ్వా సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని తెలిపింది. కొవిడ్(Covid) నియంత్రణలు తొలగింపబడినప్పటికీ.. వైరస్ తో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మాస్కులు వాడడం, వాడకపోవడం అనేది ప్రజల వ్యక్తిగత అభిప్రాయమని, అది తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్(Cabinet) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్-19 పూర్తిగా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కోవిడ్-19 నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది. అయితే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఒకవేళ రాష్ట్రాలలో కేసులు పెరిగితే స్థానిక ప్రభుత్వాలు నిబంధనలు విధించుకోవచ్చని కేంద్ర హోం శాఖ సూచించింది.
అన్ని నిబంధనలు ఇకపై పొడగించాల్సిన అసవరం లేదని భావిస్తున్నాం. మార్చి 31న ప్రస్తుతమున్న ఆంక్షల గడువు ముగియనుంది. ఆ తర్వాత హోంశాఖ ఎలాంటి కొత్త ఆదేశాలు జారీ చేయదు. అయితే, ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వంటి కనీస జాగ్రత్తలు పాటించాలి. వైరస్ వ్యాప్తి ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయలేం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.
– రాష్ట్రాలకు కేంద్రం పంపిన లేఖల్లో వ్యాఖ్యలు
Also Read
AP High Court: నేర చరితులకు టీటీడీ పదవులు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు!
Road Accident: రక్తమోడిన రహదారులు.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మిలటరీ జవాన్ సహా నలుగురు మృతి