Crime news: టామాటా అని భార్యను గేలి చేశాడనుకుని.. వృద్ధుడిపై వ్యక్తి దాడి.. చివరకు

ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉంటున్న వారి మధ్య సరదా సంభాషణలు సర్వ సాధారణం. అవి కొందరికి వినోదం కలిగిస్తే.. మరి కొందరికి విసుగు కలిగిస్తాయి. తనను పక్కింటి వ్యక్తి టమాటా అని గేలి(Teasing) చేస్తున్నాడని భావించిన ఓ వివాహిత...

Crime news: టామాటా అని భార్యను గేలి చేశాడనుకుని.. వృద్ధుడిపై వ్యక్తి దాడి.. చివరకు
Crime News
Ganesh Mudavath

|

Mar 31, 2022 | 7:48 PM

ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉంటున్న వారి మధ్య సరదా సంభాషణలు సర్వ సాధారణం. అవి కొందరికి వినోదం కలిగిస్తే.. మరి కొందరికి విసుగు కలిగిస్తాయి. తనను పక్కింటి వ్యక్తి టమాటా అని గేలి(Teasing) చేస్తున్నాడని భావించిన ఓ వివాహిత ఈ విషయాన్ని తన భర్తకు వివరించింది. దాంతో అతను తీవ్ర ఆగ్రహానికి లోనై సదరు వ్యక్తిపై దాడి(Attack) చేశాడు. తాను అలా అనలేదని, అసలు ఎగతాళి చేసే ఉద్దేశ్యమే తనకు లేదని, తనను విడిచిపెట్టాలని వేడుకున్నా అతను కనికరించలేదు. దీంతో తీవ్ర భయంతో అతనికి గుండెపోటు వచ్చింది. అక్కడికక్కడే మృతి చెందాడు. బిహార్(Bihar) లోని ముంగేర్ జిల్లా జగత్ పుర్ గ్రామంలో మహేశ్​దాస్, బ్రహ్మదేవ్ దాస్ పక్క పక్క ఇళ్లల్లో నివాసముంటున్నారు. కూరగాయలు కొనుగోలు చేసేందుకు మహేశ్ మార్కెట్ కు వెళ్లాడు. అదే సమయంలో బ్రహ్మదేవ్ దాస్ భార్య అక్కడికి వచ్చింది. ఈ క్రమంలో మహేశ్ కు తెలిసిన వ్యక్తి కనిపిస్తే అతనితో మాట్లాడుతున్నాడు. మాటలో మధ్యలో తాను టమాటాలు కొనడం మర్చిపోయానని చెప్పాడు. ఆ మాటలు విన్న బ్రహ్మదేవ్ భార్య.. తననే టమాట అంటూ ఆటపట్టిస్తున్నాడని అభిప్రాయపడింది. జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది.

విషయం తెలుసుకున్న భర్త బ్రహ్మదాస్ తీవ్ర కోపోద్రిక్తుడై.. మహేశ్​ఇంటికి వెళ్లి అతడ్ని నిలదీశాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బ్రహ్మదేవ్ కు మరికొందరు కూడా సహకరించారు. దాడి ఘటనలో మహేశ్ సొమ్మసిల్లి కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు మహేశ్ ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మహేశ్ మరణించాడని వైద్యులు నిర్ధరించారు. మహేశ్ మృతికి కారకులైన వారిపై అతని కుటుంబసభ్యులు బ్రహ్మదేవ్ తో పాటు మరో ఆరుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరోవైపు పోస్టు మార్టం రిపోర్టులో నిర్ఘాంతపోయే విషయాలు వెల్లడయ్యాయి. మహేశ్ మృతదేహంపై దాడి చేసిన గుర్తులు గానీ, గాయాలు గానీ ఏమీ లేవని వైద్యులు తెలపడం ఆందోళన కలిగిస్తోంది. దాడి చేయగానే అతడు కిందపడిపోవడంతో గుండెపోటు వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read

పేస్ కట్స్ తో సహా గుర్తుపట్టలేనట్టు మారిపోయిన తెలుగు ముద్దుగుమ్మ మీరా జాస్మిన్

BJP vs TMC: ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన విద్యార్థులకు మీరేం చేశారు.. కేంద్రాన్ని నిలదీసిన మమతా బెనర్జీ!

Astrology: ఏప్రిల్‌లో పుట్టిన వ్యక్తులకి ప్రత్యేక లక్షణాలు.. ఈ విషయాలలో భిన్నమైన గుర్తింపు..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu