LSG vs CSK, IPL 2022: ఏం కొట్టారు సామీ.. ఉత్కంఠ పోరులో చెన్నైని మట్టికరిపించిన లక్నో సూపర్ జెయింట్స్..
Lucknow Super Giants vs Chennai Super Kings: చెన్నై మరోసారి చతిలికపడిపోయింది. నువ్వా నేనా అంటూ ఉత్కంఠభరితంగా సాగిన హోరాహోరీ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చిత్తు చేసింది లక్నో సూపర్ జెయింట్స్ టీమ్.
Lucknow Super Giants vs Chennai Super Kings: చెన్నై మరోసారి చతిలికపడిపోయింది. నువ్వా నేనా అంటూ ఉత్కంఠభరితంగా సాగిన హోరాహోరీ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చిత్తు చేసింది లక్నో సూపర్ జెయింట్స్ టీమ్. నిర్ణీత 20 ఓవర్లలో 3 బంతులు మిగిలి ఉండగానే.. 210 పరుగుల లక్ష్యాన్ని చేధించి ఘన విజయాన్ని నమోదు చేసింది. ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌కు దిగింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఇక 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో బ్యాట్స్‌మెన్.. తొలి నుంచి దుమ్మురేపే ఫార్ఫార్మెన్స్ చూపెట్టారు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపిస్తూ రెచ్చిపోయారు ఓపెనర్లు కేఎల్ రాహుల్, డికాక్. ఈ ఇద్దరూ కలిసి 99 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన ఇన్నింగ్స్ అందించారు. కేఎల్ రాహుల్ 26 బంతుల్లో 40 పరుగులు చేసి ఔట్ అవగా.. డికాక్ 45 బంతుల్లో 61 పరుగులు చేసి రెచ్చిపోయాడు. ఆ తరువాత వరుసగా రెండు వికెట్లు పడి.. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ఎవిన్ లేవిస్, ఆయుష్ బదోని.. ఎంటరై దుమ్మురేపారు. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియంను హోరెత్తించారు. 3 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి మ్యాచ్‌ను ముగించారు. లేవిస్ 23 బంతుల్లో 55 పరుగులు( 3 సిక్సర్లు, 6 ఫోర్లు) చేశాడు. బదోని 2 సిక్సర్లతో మెరిపించాడు. కేవలం 9 బంతుల్లో 19 పరుగులు చేశాడు.
ఇక లక్నో సూపర్ జెయింట్స్‌కు ఇది తొలి విజయం కాగా, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ఇది రెండో ఓటమి. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో తలపడిన లక్నో ఓటమి పాలవగా.. చెన్నై టీమ్ కోల్‌కతాతో తలపడి ఓటమిపాలైంది. సెకండ్ మ్యాచ్ కూడా ఓడిపోవడంతో అభిమానులు నిట్టూరుస్తున్నారు.
లక్నో టీమ్: బ్యాటింగ్: కేఎల్ రాహుల్(40), క్వింటన్ డికాక్(61), మనీష్ పాండే(5), ఎవిన్ లేవిస్(55)*, దీపక్ హుడా(13), ఆయుష్ బదోని(19)*. బౌలింగ్: అవేష్ ఖాన్ 2, ఆండ్రూ టై 2, రవి బిషోని 2.
చెన్నై టీమ్: బ్యాటింగ్: ఊతప్ప 50, రుతురాజ్ గైక్వాడ్ 1, మొయిన్ 35, శివమ్ దూబె 49, రాయుడు 27, రవీంద్ర జడేజా 17, ధోని 16, బ్రావో 1. బౌలింగ్: తుషార్ దేశ్‌పాండె 1, డ్వేన్ బ్రావో 1, ప్రిటోరియస్ 2.
????. ?. ???! ? ?
A mighty batting performance from @LucknowIPL to seal their maiden IPL victory. ? ? #TATAIPL | #LSGvCSK
Scorecard ▶️ https://t.co/uEhq27KiBB pic.twitter.com/amLhbG4w1L
— IndianPremierLeague (@IPL) March 31, 2022
Also read:
Puzzle Picture: ‘దమ్ముంటే నన్ను కనిపెట్టండి’.. డాగ్ విసిరిన సవాల్.. ఆన్సర్ చెప్పే సత్తా మీలో ఉందా?