Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aja Ekadashi 2024: అజ ఏకాదశి రోజున ఏమి చెయ్యాలి? ఏమి చేయకూడదు? ఉపవాస నియమాలను తెలుసుకోండి

శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తేదీ ఆగస్టు 29, గురువారం మధ్యాహ్నం 1:19 నుండి ప్రారంభమవుతుంది. ఇది శుక్రవారం ఆగస్టు 30 మధ్యాహ్నం 1:37 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం అజ ఏకాదశి 29 ఆగస్టు 2024న మాత్రమే జరుపుకుంటారు. ఈసారి ఏకాదశి రోజున రెండు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. సిద్ధి యోగం ఉదయం నుంచి సాయంత్రం 6.18 వరకు. ఆగస్టు 30వ తేదీ సాయంత్రం 4:39 నుండి మరుసటి రోజు ఉదయం 5:58 వరకు సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ రెండు యోగాలు పూజకు చాలా ఫలవంతంగా పరిగణించబడతాయి.

Aja Ekadashi 2024: అజ ఏకాదశి రోజున ఏమి చెయ్యాలి? ఏమి చేయకూడదు? ఉపవాస నియమాలను తెలుసుకోండి
Ekadashi 2024
Follow us
Surya Kala

|

Updated on: Aug 27, 2024 | 3:52 PM

అజ ఏకాదశి ఉపవాసం విష్ణువుకు అంకితం చేయబడిన ముఖ్యమైన ఉపవాసం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల విష్ణు ఆగ్రహంతో పుణ్యం లభిస్తుందని.. జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వాసం. అజ ఏకాదశి రోజున విధివిధానాల ప్రకారం శ్రీ మహా విష్ణువును ఆరాధించడం ద్వారా కోరికలన్నీ నెరవేరుతాయని, జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అయితే అజ ఏకాదశి రోజున కొన్ని నియమ నిబంధాలు ఉన్నాయి. అంతేకాదు అజ ఏకాదశి రోజున ప్రజలు ఏమి చేయాలి? ఏమి చేయకూడదు అనే నియమాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తేదీ ఆగస్టు 29, గురువారం మధ్యాహ్నం 1:19 నుండి ప్రారంభమవుతుంది. ఇది శుక్రవారం ఆగస్టు 30 మధ్యాహ్నం 1:37 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం అజ ఏకాదశి 29 ఆగస్టు 2024న మాత్రమే జరుపుకుంటారు.

ఈసారి ఏకాదశి రోజున రెండు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. సిద్ధి యోగం ఉదయం నుంచి సాయంత్రం 6.18 వరకు. ఆగస్టు 30వ తేదీ సాయంత్రం 4:39 నుండి మరుసటి రోజు ఉదయం 5:58 వరకు సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ రెండు యోగాలు పూజకు చాలా ఫలవంతంగా పరిగణించబడతాయి. ఉపవాసం రోజున ఉదయం నుంచి సాయంత్రం 4.39 గంటల వరకు ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. ఈ సమయంలో పూజ చేయడం శుభాఫలితలను ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

అజ ఏకాదశి రోజున ఏమి చేయాలంటే

  1. ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయాలి: అజ ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి.
  2. పూజ: విష్ణువును పూజించండి..తులసి మొక్కను పూజించండి.
  3. మంత్రోచ్ఛారణ: విష్ణువు మంత్రాలను జపించండి.
  4. కథ వినండి: అజ ఏకాదశి కథ వినండి.
  5. దానం: ఆహారం, బట్టలు, డబ్బు మొదలైనవి దానం చేయండి.
  6. భజన కీర్తన చేయండి: విష్ణువుని కీర్తిస్తూ భజన చేయండి.
  7. సాత్విక ఆహారం: పండ్లు, కూరగాయలు, పాలు తీసుకోవాలి.

అజ ఏకాదశి నాడు ఏమి చేయకూడదంటే

  1. ఆహారం తీసుకోవడం: రోజంతా ఆహారం తీసుకోకూడదు.
  2. శారీరక శ్రమ: అధిక శారీరక శ్రమకు దూరంగా ఉండాలి.
  3. వినోదం: వినోదానికి దూరంగా ఉండాలి.
  4. కోపం, హింస: కోపం, ఆగ్రహానికి దూరంగా ఉండాలి. హింస చేయవద్దు
  5. తామసిక ఆహారం: మాంసం, చేపలు, గుడ్లు మొదలైన వాటిని తీసుకోకూడదు.
  6. మద్యం, మత్తు పదార్థాలు: మద్యం,మత్తు పదార్థాలు సేవించకూడదు.

అజ ఏకాదశి ఉపవాస నియమాలు

  1. నిరాహార వ్రతం: కొంతమంది నిరాహార వ్రతాన్ని ఆచరిస్తారు, అంటే అజ ఏకాదశి రోజున ఉపవాసం చేసిన వారు రోజంతా ఏమీ తినరు.
  2. ఫ్రూట్ డైట్: కొంతమంది ఫ్రూట్ డైట్ ఫాలో అవుతుంటారు. అంటే కేవలం పండ్లను మాత్రమే తింటారు.
  3. ఒక పూట భోజనం: కొందరు ఒక్కోసారి భోజనం చేస్తుంటారు.
  4. పురాణ కథలు: ఈ రోజున గ్రంధాలను అధ్యయనం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  5. విష్ణువు ఆలయానికి వెళ్లడం: ఆలయానికి వెళ్లి విష్ణువును పూజించండి.

అజ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల మనిషికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ఉపవాసం ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. అజ ఏకాదశి రోజున ఉపవాసం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే పండితులని సంప్రదించవచ్చు. వివిధ మత గ్రంథాలలో ఉపవాసం సమయం, పూజా పద్ధతి కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు