AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holy Tulasi: తులసిలో ఒకటి కాదు అనేక రకాలు ఉన్నాయి.. వాటి ప్రత్యేకత ఔషధ గుణాలు ఏమిటంటే

యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫ్లూ, యాంటీ బయోటిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తులసిలో ఉన్నాయి. హిందువుల ఇళ్లలో తులసి మొక్కలు పెంచుతున్నారు. అయితే తులసి మొక్కలు చాలా రకాలుగా ఉన్నాయని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. చాలా మంది తమ ఇళ్లలో ముదురాకు ఆకుపచ్చ రంగు శ్యామ తులసిని కలిగి ఉంటారు. అంతేకాదు రకరకాల తులసి మొక్కలు ఉన్నాయి. ఈ రోజు రకరకాల తులసి మొక్కల గురించి ఈ రోజు తెలుసుకుందాం

Holy Tulasi: తులసిలో ఒకటి కాదు అనేక రకాలు ఉన్నాయి.. వాటి ప్రత్యేకత ఔషధ గుణాలు ఏమిటంటే
Holy Basil Tulsi
Surya Kala
|

Updated on: Aug 27, 2024 | 5:10 PM

Share

భారతదేశంలోని చాలా ఇళ్లలో తులసి మొక్క కనిపిస్తుంది. ఇది హిందువులకు అత్యంత ప్రాముఖ్యత ఉన్న మొక్క అంతేకాదు ఔషధ గుణాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇది ఆరోగ్యానికి, చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించవచ్చు. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం, చర్మం, జుట్టు కోసం ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. తులసి సహజ హైడ్రేటింగ్ లక్షణాలను కలిగి ఉంది. ఇది చర్మానికి తేమను అందించడంలో సహాయపడుతుంది. పొడి చర్మం నుంచి ఉపశమనం ఇస్తుంది. ఇది మొటిమలకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా సహాయపడుతుంది.

  1. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫ్లూ, యాంటీ బయోటిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తులసిలో ఉన్నాయి. హిందువుల ఇళ్లలో తులసి మొక్కలు పెంచుతున్నారు. అయితే తులసి మొక్కలు చాలా రకాలుగా ఉన్నాయని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. చాలా మంది తమ ఇళ్లలో ముదురాకు ఆకుపచ్చ రంగు శ్యామ తులసిని కలిగి ఉంటారు. అంతేకాదు రకరకాల తులసి మొక్కలు ఉన్నాయి. ఈ రోజు రకరకాల తులసి మొక్కల గురించి ఈ రోజు తెలుసుకుందాం
  2. శ్యామ తులసి మొక్క: శ్యామ తులసి ఆకులు ఊదా రంగులో ఉంటాయి. దీనిని శ్యామ తులసి అంటారు. అంతేకాదు కృష్ణ తులసి అని కూడా అంటారు. మత విశ్వాసాల ప్రకారం ఇది శ్రీకృష్ణుడికి చాలా ప్రియమైనది. కన్నయ్యకి ఇష్టమైన తులసి మొక్క కనుక దీనిని శ్యామ తులసి అని కూడా అంటారు. శ్యామ తులసి ఆకులలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ వంటి వివిధ ఔషధ గుణాలు ఉన్నాయి. కనుక ఈ తులసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడతాయి.
  3. రామ తులసి మొక్క: రామతులసి ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీనిని శ్రీ తులసి, లక్కీ తులసి అని కూడా అంటారు. ఈ తులసిని పూజలో ఉపయోగిస్తారు. చాలా ఇళ్లలో రామతులసి కనిపిస్తుంది. దీని ఆకులు రుచిలో తియ్యగా ఉంటాయి. దీనిని ఉజ్వల తులసి అని కూడా అంటారు.
  4. విష్ణు తులసి: తెల్ల తులసిని విష్ణుతులసి అని కూడా అంటారు. దానిని గుర్తించడానికి సులభమైన మార్గం తులసి మొక్కకు తెలుపు పువ్వులు పూస్తాయి. ఇది చాలా అరుదుగా ఇళ్లలో పెరుగుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. అటవీ తులసి: వాన్ తులసిని అడవి తులసి అని కూడా అంటారు. దీని ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకులు చక్కగా ఉంటాయి. ఇది నిమ్మకాయ వంటి వాసన, రుచిని కలిగిస్తాయి. ఈ తులసి మొక్కను టీ తయారీకి కూడా ఉపయోగిస్తారు. వెయిటింగ్ సిస్టమ్‌ను మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి. ఇది విటమిన్ ఎ కి మంచి మూలం. దీనిని అడవి తులసి అని కూడా అంటారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)