kitchen Hacks: వర్షాకాలంలో మసాలాదినుసులు చెడిపోకుండా నిల్వ చేయాలా.. ఈ సింపుల్ టిప్స్ మీ కోసం

చాలా మంది ప్రజలు ప్రతిరోజూ ఉపయోగించే మసాలా దినుసులను తక్కువ పరిమాణంలో పోపుల పెట్టేలో నిల్వ చేస్తారు. మిగిలిన మసాలా దినుసులను ప్లాస్టిక్ లేదా స్టీల్ కంటైనర్లలో నిల్వ చేస్తారు. అటువంటి పరిస్థితిలో ప్రతిరోజూ అన్ని రకాల మసాలా దినుసులను ఉపయోగించరు. అయితే వాడని మసాలా వస్తువులు చెడిపోతాయనే భయం చాలా మందిలో ఉంటుంది. వర్షాకాలంలో మసాలా దినుసులు పాడవకుండా ఎలా జాగ్రత్తపడాలో ఈ రోజు తెలుసుకుందాం..

kitchen Hacks: వర్షాకాలంలో మసాలాదినుసులు చెడిపోకుండా నిల్వ చేయాలా.. ఈ సింపుల్ టిప్స్ మీ కోసం
Monsoon Hacks
Follow us
Surya Kala

|

Updated on: Aug 27, 2024 | 4:15 PM

వర్షాకాలంలో ఆరోగ్యంతో పాటు ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్‌లో వాతావరణంలో తేమతో నిండి ఉంటుంది. దీంతో ఇంట్లో వస్తువులతో పాటు వంటగదిలోని మసాలా దినుసుల వరకు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వంటగదిలో ఉండే మసాలా దినుసులు చాలా సులభంగా పాడైపోతాయి. కీటకాలు సోకిన తర్వాత సుగంధ ద్రవ్యాలను ఉపయోగించలేరు. చాలా మంది ప్రజలు ప్రతిరోజూ ఉపయోగించే మసాలా దినుసులను తక్కువ పరిమాణంలో పోపుల పెట్టేలో నిల్వ చేస్తారు.

మిగిలిన మసాలా దినుసులను ప్లాస్టిక్ లేదా స్టీల్ కంటైనర్లలో నిల్వ చేస్తారు. అటువంటి పరిస్థితిలో ప్రతిరోజూ అన్ని రకాల మసాలా దినుసులను ఉపయోగించరు. అయితే వాడని మసాలా వస్తువులు చెడిపోతాయనే భయం చాలా మందిలో ఉంటుంది. వర్షాకాలంలో మసాలా దినుసులు పాడవకుండా ఎలా జాగ్రత్తపడాలో ఈ రోజు తెలుసుకుందాం..

ఎండలో మసాలా దినుసులను పెట్టండి

వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా సుగంధ ద్రవ్యాలు కూడా తేమగా మారుతాయి. దీని కారణంగా మాసాలా దినుసులు ముద్దగా మారతాయి. అందువల్ల వర్షాకాలంలో సుగంధ ద్రవ్యాలను ఎండలో పెట్టుకోండి. అయితే దీని కోసం మసాలా దినుసులు బయటకు తీసి ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. సుగంధ ద్రవ్యాలతో గాజు పాత్రలను నేరుగా ఎండలో ఉంచండి. దీని వల్ల వాటి రుచి చెడిపోదు. అదే సముయంలో తేమ కూడా పోతుంది.

ఇవి కూడా చదవండి

గాజు కంటైనర్లో నిల్వ చేయండి

చాలా ఇళ్లలో సుగంధ ద్రవ్యాలు ప్లాస్టిక్ లేదా స్టీల్ కంటైనర్లలో ఉంచబడతాయి. అయితే వర్షాకాలంలో మాత్రం ప్లాస్టిక్, స్టీలు పాత్రలకు బదులు గాజు సీసాల్లో ఉంచడం మంచిది. ఎందుకంటే మసాలాలలో తేమ ఉంటే వాటిని సులభంగా ఎండలో పెట్టుకోవచ్చు

తాజా సుగంధ ద్రవ్యాలు ఉపయోగించండి

వర్షాకాలంలో మసాలా పొడికి బదులుగా మసాలాలను వేటికి అవే ఉపయోగించండి. మసాలా పొడి వర్షాలకు త్వరగా పాడవుతుంది. కనుక వర్షాకాలంలో నిల్వ చేసిన మసాలా పొడి కంటే ఎప్పుడు అవసరం అయితే అప్పుడు మసాలా దినుసులను ఉపయోగించి మసాలా పొడిని తయరు చేసుకోండి. ఇలా ఉపయోగించడం మంచిది.

మసాలా దినుసులను ఒక్కసారి వేడి చేయండి

మసాలాలు చెడిపోకుండా ఉండాలంటే వాటిని లైట్ గా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్ లేదా బాణలిలో తక్కువ మంటపై వేయించండి. పాన్ వేడి ఎక్కిన తర్వాత అందులో మసాలా దినుసులు వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారిన తర్వాత గాజు కంటైనర్ లో నిల్వ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మసాలా దినుసుల్లోకి క్రిములు ప్రవేశించవు. అంతేకాదు మసాలా దినుసుల రుచి, రంగు కూడా పోదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI