Ganesh Chaturthi: ఈ ఏడాది వినాయక చవితికి ఏర్పడనున్న భద్రవస్ యోగం.. ఈ సమయంలో పూజిస్తే అత్యంత ఫలవంతం..

ఈసారి వినాయక చవితి రోజున భద్రావస్ యోగం ఏర్పడుతోంది. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అంతేకాదు ఈ సందర్భంగా చాలా ప్రయోజనకరమైన అనేక ఇతర యోగాలు ఏర్పడుతున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రోజున బ్రహ్మయోగం, ఇంద్రయోగం ఏర్పడుతున్నాయి. ఈ రెండు యోగాలు కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. అంతేకాదు ఈ రోజున సిద్ధయోగం కూడా ఏర్పడుతోంది.

Ganesh Chaturthi: ఈ ఏడాది వినాయక చవితికి ఏర్పడనున్న భద్రవస్ యోగం.. ఈ సమయంలో పూజిస్తే అత్యంత ఫలవంతం..
Ganesh Chaturthi 2024
Follow us
Surya Kala

|

Updated on: Aug 27, 2024 | 6:30 PM

2024 సంవత్సరంలో వినాయక చవితి పండగను సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకోనున్నారు. ఈ రోజున హిందువులు గణపతి విగ్రహాన్ని తీసుకువచ్చి తమ ఇళ్లలో ప్రతిష్టించి పూజిస్తారు. గణేష్ చతుర్థి సందర్భంగా మీ అదృష్టాన్ని మార్చే యోగం ఏర్పడనుంది. ఈ యోగాలో భగవంతుడిని మనస్పూర్తిగా పూజిస్తే మంచి రోజులు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరం వినాయక చవితి పూజ సమయంలో ఏర్పడే భద్ర వాస యోగం అంటే ఏమిటో తెలుసుకుందాం.

భద్రవస యోగం అంటే ఏమిటి?

వినాయక చవితి పండుగ భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి నాడు జరుపుకుంటారు. ఈ రోజు వినాయకుడిని పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు. ఈసారి భద్రవస్ యోగం 7 సెప్టెంబర్ 2024 ఉదయం 04:20 గంటలకు ఏర్పడుతోంది. సాయంత్రం 5:37 గంటలకు ముగుస్తుంది. భద్ర పాతాళంలో నివసించే కాలం ఇది. భద్రుడు పాతాళంలో ఉండడం వల్ల భూలోకంలో నివసించే వారికి క్షేమం చేకూరుతుందని.. సుఖ సంతోషాలు పెరుగుతాయని పురాణం గ్రంధాలలో కథనం.

మరిన్ని శుభ యోగాలు ఏర్పడుతున్నాయి

ఈసారి వినాయక చవితి రోజున భద్రావస్ యోగం ఏర్పడుతోంది. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అంతేకాదు ఈ సందర్భంగా చాలా ప్రయోజనకరమైన అనేక ఇతర యోగాలు ఏర్పడుతున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రోజున బ్రహ్మయోగం, ఇంద్రయోగం ఏర్పడుతున్నాయి. ఈ రెండు యోగాలు కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. అంతేకాదు ఈ రోజున సిద్ధయోగం కూడా ఏర్పడుతోంది. ఈ యోగా చాలా ప్రయోజనకరంగా కూడా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ రెండు రాశుల వారికి జ్ఞానం, బలాన్ని అందిస్తాయి

అంతేకాదు చిత్త నక్షత్రం, స్వాతి నక్షత్రాలు కూడా ఈ రోజున కనిపిస్తాయి. ఈ రెండు నక్షత్రాలు చాలా ఫలవంతమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఆకాశంలో మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ రాశులలో స్వాతి నక్షత్రం చదువుల తల్లి సరస్వతి దేవికి సంబంధించినది. దీంతో విద్యా రంగంలో పురోగతిని తెస్తుంది. అదే రోజున అడుగు పెట్టనున్న చిత్త నక్షత్రం కూడా 27 నక్షత్రాల్లో 14 వ నక్షత్రం. ఈ నక్షత్రం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు.ఇది శక్తికి చిహ్నం. వినాయక చవితి రోజున చిత్త నక్షత్రం మధ్యాహ్నం 12.34 గంటలకు ముగుస్తుంది. ఈ నక్షత్రం ముగిసిన తర్వాత స్వాతి నక్షత్రం అడుగు పెడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు