Janmashtami 2024: వైభవంగా సాగుతున్న జన్మాష్టమి వేడుకలు.. మధుర నుండి ద్వారక వరకు ప్రధాన ఆలయాల్లో భక్తుల సందడి
సరిగ్గా రాత్రి 12 గంటలకు దేశంలోని అన్ని కృష్ణ దేవాలయాలు 'కన్నయ్య పుట్టిన జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జై కృష్ణ అనే నినాదంతో ప్రతి ఆలయం ప్రతిధ్వనించింది. దేశ వ్యాప్తంగా జన్మాష్టమి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఎక్కడ చూసినా భక్తులు కన్నయ్యను కీర్తిస్తూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. జన్మాష్టమి సందర్భంగా ఆలయాలన్నీ రంగు రంగుల విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. బాల గోపాలుడికి ప్రత్యేక స్వీట్లు, వంటకాలు అందించారు. దేశంలో మాత్రమే కాదు విదేశాల్లోని కన్నయ్య ప్రతి ఆలయం అందంగా అలంకరించబడ్డాయి. దేవాలయాలలో ప్రత్యేక పూజలు భజనలు, కీర్తనలు వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలను భక్తులు తిలకించి పులకించారు. కృష్ణుడి పట్ల భక్తితో లీనమయ్యారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




