Viral Video: వీళ్లు అసలు మనుషులేనా..! చనిపోయిన తిమింగలంపై డ్యాన్స్ .. వీడియో వైరల్
మరణించిన తిమింగలం మృత కళేబరంపై కొంతమంది వ్యక్తులు నృత్యం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వన్యప్రాణుల పట్ల కొందరికి ఎంత గౌరవం ఉందో కూడా చూపిస్తుంది. సముద్రపు జీవావరణ వ్యవస్థకు కీలకమైన తిమింగలాలు వంటి భారీ జీవులు మరణించిన తర్వాత కూడా గౌరవానికి అర్హమైనవి. అయితే కొందరు వ్యక్తులు తమ వెకిలి చేష్టలను ప్రదర్శిస్తున్నారు.
తాజాగా వైరల్ అవుతున్న ఓ ఘటన చాలా బాధాకరంగా ఉంది. అంతేకాదు మనుసుల మనస్తత్వం గురించి ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. సముద్రంలో తిమింగలాలు, ఇతర పెద్ద చేపల సంఖ్య తగ్గడం వెనుక మానవ కార్యకలాపాలు ప్రధాన కారణం.. ఈ జీవుల పట్ల మానవుల ప్రవర్తన గురించి చెప్పడమే కాదు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుంది. వైరల్ అయిన క్లిప్‌లో ఇద్దరు వ్యక్తులు తిమింగలం మృతదేహంపై దూకడం, నృత్యం చేయడం, నవ్వడం చూడవచ్చు. ఈ అమానవీయ ప్రవర్తన ఇంటర్నెట్‌లో దుమారం రేపింది. వన్యప్రాణుల సంరక్షణ ప్రయత్నాలకు అవమానకరమైనది. హానికరం అని ప్రజలు పేర్కొన్నారు.
మరణించిన తిమింగలం మృత కళేబరంపై కొంతమంది వ్యక్తులు నృత్యం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వన్యప్రాణుల పట్ల కొందరికి ఎంత గౌరవం ఉందో కూడా చూపిస్తుంది. సముద్రపు జీవావరణ వ్యవస్థకు కీలకమైన తిమింగలాలు వంటి భారీ జీవులు మరణించిన తర్వాత కూడా గౌరవానికి అర్హమైనవి. అయితే కొందరు వ్యక్తులు తమ వెకిలి చేష్టలను ప్రదర్శిస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో మరణించిన తిమింగలం గురించి ప్రజలు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే దాని శరీరంలో వాయువుల కారణంగా ప్రమాదం పొంచి ఉంది. అది ప్రాణాంతకం కావచ్చు. ఇటువంటి సంఘటనలు పర్యావరణ అవగాహన లోపాన్ని ప్రతిబింబించడమే కాదు కొంతమంది వ్యక్తులు జీవితం, ప్రకృతి పట్ల ఎంత నిరాసక్తతతో ఉంటారో చూపిస్తుంది.
చనిపోయిన తిమింగలం మీద ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్న వీడియో
Stupid people dancing on a dead whale carcass 😡 pic.twitter.com/ZqEcLrUOcj
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 26, 2024
ఈ వీడియో Xలో @AMAZlNGNATURE హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ వీడియోని చూసిన తర్వాత నెటిజన్లు ఎంత కోపంగా ఉన్నారో వీడియో చూసి చేసిన వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతుంది. ఒకరు ఇలా వ్యాఖ్యానించారు “ఇది చూస్తుంటే తన హృదయం బాధతో ములుగుతుందని పేర్కొన్నాడు. ఇప్పటికే సముద్రంలో తిమింగలాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయినా ప్రజల్లో ఎటువంటి పర్యావరణ పరిరక్షణ గురించి చింత లేదని అంటున్నారు. అదే సమయంలో మరొకరు ఇది చాలా అసహ్యంగా ఉంది. చనిపోయిన జంతువుపై నృత్యం చేయడం ఎలా ఆనందిస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..