Vastu tips: ఇంట్లో ఎయిర్ కూలర్ ఈ దిక్కున ఉంచండి.. ఇల్లు సంపదతో నిండిపోతుంది..!

ముఖ్యంగా నీలం, ఎరుపు, బూడిద రంగుల ఎయిర్ కూలర్ ఇంట్లో పెట్టకూడదని వాస్తు శాస్త్రంలో నమ్మకం. దీంతో ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో మనస్పర్థలు, విభేదాలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో పాటు వాస్తు దోషం కూడా కలుగుతుందని తెలుస్తోంది. ఇది ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఎయిర్‌ కూలర్‌ ఎక్కడ ఏర్పాటు చేయాలో తెలుసుకుందాం..

Vastu tips: ఇంట్లో ఎయిర్ కూలర్ ఈ దిక్కున ఉంచండి.. ఇల్లు సంపదతో నిండిపోతుంది..!
Air Cooler In This Directio
Follow us
Jyothi Gadda

|

Updated on: May 30, 2023 | 6:23 PM

చాలా మంది వేసవిలో ఎయిర్ కూలర్‌ని వాడుతుంటారు. కానీ సరైన దిశలో ఉంచకపోతే అది వాస్తు సమస్యలను కలిగిస్తుందని మీకు తెలుసా.? అవును.. ఇంట్లోని ప్రతి వస్తువుకు వాస్తుతో సంబంధం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.. ఇంట్లోని వస్తువులను వాస్తు నియమాల ప్రకారం ఉంచితే ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇంటికి చల్లదనాన్ని తెచ్చే ఎయిర్ కూలర్‌ను ఉంచడానికి కూడా సరైన దిశను తెలుసుకోవాలని సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తెల్లటి రంగు ఎయిర్ కూలర్ ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు. ఇది కాకుండా, మీరు వేరే రంగులు వేయాలనుకుంటే, క్రీమ్ లేదా సిల్వర్ రంగును ఎంచుకోవచ్చని చెబుతున్నారు.

అయితే, ఇప్పటికే మీ ఇంట్లో విభిన్న రంగులో ఎయిర్ కూలర్ ఉన్నట్టయితే, ఈ వార్త చదివిన వెంటనే మీరు దాని ఈ రంగును మార్చుకోవచ్చు. ఎందుకంటే..ముఖ్యంగా నీలం, ఎరుపు, బూడిద రంగుల ఎయిర్ కూలర్ ఇంట్లో పెట్టకూడదని వాస్తు శాస్త్రంలో నమ్మకం. దీంతో ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో మనస్పర్థలు, విభేదాలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో పాటు వాస్తు దోషం కూడా కలుగుతుందని తెలుస్తోంది. ఇది ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఎయిర్‌ కూలర్‌ ఎక్కడ ఏర్పాటు చేయాలో తెలుసుకుందాం..

ఎయిర్‌ కూలర్‌ ఏర్పాటుకు సరైన దిశ:

వాస్తు ప్రకారం, ఎయిర్ కూలర్ సరైన దిశలో ఉంటే, ఇంట్లో డబ్బు సమస్యలు తొలగిపోతాయి. తద్వారా ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నిలకడగా ఉంటుంది. కానీ ఎయిర్ కూలర్‌ను తప్పు దిశలో ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు నష్టం, చెడు పరిణామాలకు దారితీస్తుంది. అంతేకాదు..జీవితంలో, కెరీర్‌లో పురోగతిని పొందడానికి ఎయిర్ కూలర్‌ను ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉంచాలి. ఈ దిశలో ఉంచడం వల్ల ఇల్లు చల్లగా ఉంటుంది. ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. దీనిని వాయువ్య దిశలో కూడా ఉంచవచ్చు. నైరుతి దిశలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచరాదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).