Vastu Tips: ఇంట్లో డస్ట్‌బిన్‌ ఈ దిక్కున ఉందా.? చాలా నష్టపోతారు జాగ్రత్తా..

ఇంటి నిర్మాణంలో వాస్తు దోషాలు ఉంటే ఎలాగైనే ఇంట్లో ఉండే వ్యక్తులపై ప్రభావం పడుతుందో ఇంట్లో ఉండే వస్తువులు, వాటిని ఏర్పాటు చేసే దిశల వల్ల కూడా ప్రభావం ఉంటుందని మీకు తెలుసా.? ముఖ్యంగా ఇంట్లో డస్ట్‌బిన్‌ను ఏర్పాటు చేసే దిశ ఇంట్లో వారిపై ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు...

Vastu Tips: ఇంట్లో డస్ట్‌బిన్‌ ఈ దిక్కున ఉందా.? చాలా నష్టపోతారు జాగ్రత్తా..
Vastu Tips
Follow us

|

Updated on: Jan 26, 2023 | 4:26 PM

ఇంటి నిర్మాణంలో వాస్తు దోషాలు ఉంటే ఎలాగైనే ఇంట్లో ఉండే వ్యక్తులపై ప్రభావం పడుతుందో ఇంట్లో ఉండే వస్తువులు, వాటిని ఏర్పాటు చేసే దిశల వల్ల కూడా ప్రభావం ఉంటుందని మీకు తెలుసా.? ముఖ్యంగా ఇంట్లో డస్ట్‌బిన్‌ను ఏర్పాటు చేసే దిశ ఇంట్లో వారిపై ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని దిక్కుల్లో ఎట్టి పరిస్థితుల్లో డస్ట్‌బిన్స్‌ను ఏర్పాటు చేయకూడదు. ఇంతకీ ఏ దిక్కులో డస్ట్‌బిన్స్‌ను ఏర్పాటు చేయకూడదు.? చేస్తే ఎలాంటి పరిణామాలు ఏర్పడుతాయిలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తు ప్రకారం డస్ట్ బిన్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్య దిశలో ఎప్పుడూ ఉంచకూడదు. ఈశాన్య దిక్కును దేవతల దిక్కుగా భావిస్తారు. ఈ దిశలో డస్ట్‌బిన్‌ను ఉంచడం వల్ల ఇంటి సభ్యులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీని వల్ల ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. దీని వల్ల కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. అంతే కాకుండా తూర్పు, ఆగ్నేయం, ఉత్తరం దిశలలో చెత్తబుట్టలను ఉంచకూడదు. దీంతో కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

ఇక డస్ట్‌బిన్‌ను ఏర్పాటు చేయడానికి వాస్తు శాస్త్రం ప్రత్యేకంగా ఒక దిశను నిర్దేశించింది. డస్ట్‌బిన్‌ను నైరుతి లేదా వాయువ్య దిశలో ఉంచడం మంచిది. వాయువ్య దిశలోనూ డస్ట్‌బిన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం డస్బ్‌బిన్‌ను ఇంటి లోపల ఏర్పాటు చేయాలని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్‌: పైన తెలిపిన విషయాలు కొందరు వాస్తు నిపుణుల అభిప్రాయాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..