AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishakh Purnima 2023: లక్ష్మీకటాక్షం కోసం ఈ పౌర్ణమికి ఇలా చేయండి.. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి..

Vaishakh Purnima 2203: సనాతన హిందూ ధర్మంలోని నమ్మకాల ప్రకారం వైశాఖ పూర్ణిమ ఎంతో ప్రముఖమైనది. ఈ రోజు అంటే మే 5న వైశాఖ పూర్ణిమతో పాటు చంద్రగ్రహణం కూడా ఉంది. పైగా ఇదంతా శుక్రవారం రోజునే జరగడం విశేషం. శుక్రవారం అనేది సిర సంపదల దేవత..

Vaishakh Purnima 2023:  లక్ష్మీకటాక్షం కోసం ఈ పౌర్ణమికి ఇలా చేయండి.. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి..
Vaishakh Purnima 2023
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 05, 2023 | 1:04 PM

Share

Vaishakh Purnima 2203: సనాతన హిందూ ధర్మంలోని నమ్మకాల ప్రకారం వైశాఖ పూర్ణిమ ఎంతో ప్రముఖమైనది. ఈ రోజు అంటే మే 5న వైశాఖ పూర్ణిమతో పాటు చంద్రగ్రహణం కూడా ఉంది. పైగా ఇదంతా శుక్రవారం రోజునే జరగడం విశేషం. శుక్రవారం అనేది సిర సంపదల దేవత శ్రీ మహాలక్ష్మికి అంకితం చేసిన రోజు. ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే ఈ పౌర్ణమి రాత్రి సఖల ఐశ్వర్యాలను పొందేందుకు, స్థితిగతులను అనుకూలంగా మార్చుకునేందుకు మంచి సదావకాశం. అందుకోసం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా అవసరం. ఆ అమ్మను ప్రసన్నం చేసుకుంటే మీ ఇంటికి సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు వాటంతట అవే వస్తాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవిని ఎలా పూజించి, ప్రసన్నం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వైశాఖ పూర్ణిమ శుభ సమయంలో శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి దంపతులను పూజించండి. అయితే ఈ పూజలో 11 పసుపు కవడలను అమ్మవారికి సమర్పించండి. పసుపు పొలుసులు లేకపోతే, తెల్లటి ప్రదేశంలో పసుపును రాయవచ్చు. ఆ మరుసటి రోజు వీటిని ఎర్రటి గుడ్డలో కట్టి, మీ ఇంట్లోనే భద్రంగా ఉంచండి. ఇలా చేయడంతో పాటు ప్రతిరోజూ లక్ష్మిదేవిని ప్రార్థించండి. తత్ఫలితంగా మీ జీవితంలో సిరిసంపద, సుఖదానందాలు పెరుగుతాయి.

పౌర్ణమి రోజున తెల్లని రంగును ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ఆ నేపథ్యంలో ఈ రోజు తెల్లని దుస్తులు ధరించండి. నిష్టనియమాల ప్రకారం లక్ష్మీదేవిని పూజించండి. పూజలో లక్ష్మీదేవికి వెన్న, కుంకుమ కలిపి సమర్పించండి. ఆ తర్వాత రోజు స్నానం చేసి ఈ వెన్నె ప్రసాదాన్ని తీసుకోవాలి. తద్వారా లక్ష్మిదేవి సంతోషించడంతో పాటు మీ మొత్తం కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది.

ఇవి కూడా చదవండి

పౌర్ణమి రోజున మీ వ్యాపార స్థలంలో లక్ష్మీ దేవి విగ్రహం లేదా చిత్రం దగ్గర గోమతి చక్రాన్ని అమర్చండి. ఆ తర్వాత కనకధారా స్తోత్రాన్ని పఠించాలి. మరుసటి రోజు ఈ గోమతి చక్రాన్ని సంపదల స్థానంలో ఉంచాలి. ఇది మీకు వ్యాపారంలో వేగవంతమైన పురోగతిని అందిస్తుంది.

వైశాఖ పూర్ణిమ నాటి ఉదయం స్నానం చేసిన తర్వాత, ఒక రాగి పాత్రలో నీటిని తీసుకుని, దానిలో కొంత పసుపును ప్రధాన ద్వారానికి రెండు వైపులా చల్లాలి. ఆలయానికి కొత్త చీపురు కూడా దానం చేయండి. ఫలితంగా శ్రీమహాలక్ష్మి మీపై తన అనుగ్రహాన్ని చూపిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).