AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: తులసి మొక్క ఇంట్లో ఉంటే తప్పక పాటించాల్సిన నియమాలివే.. లేకపోతే అర్థిక సమస్యలు తప్పవు..!

Vastu Tips For Tulasi: సనాతన హిందూ ధర్మంలో తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు, అందుకే ఈ మొక్కకు ఆది నుంచి కూడా ఎంతో ప్రాముఖ్యంగా పెంచుకుంటుంటారు. ఈ కారణంగానే చాలా మంది తులసి మొక్కను తమ ఇంట్లో నాటాలని కూడా..

Vastu Tips: తులసి మొక్క ఇంట్లో ఉంటే తప్పక పాటించాల్సిన నియమాలివే.. లేకపోతే అర్థిక సమస్యలు తప్పవు..!
Vastu Tips For Tulasi
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 05, 2023 | 2:56 PM

Share

Vastu Tips For Tulasi: సనాతన హిందూ ధర్మంలో తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు, అందుకే ఈ మొక్కకు ఆది నుంచి కూడా ఎంతో ప్రాముఖ్యంగా పెంచుకుంటుంటారు. ఈ కారణంగానే చాలా మంది తులసి మొక్కను తమ ఇంట్లో నాటాలని కూడా కోరుకుంటారు. అయితే తులసి మొక్కలను నాటే ముందు లేదా ఇంట్లో ఉండే కొన్ని రకాల వాస్తు నియమాలను పాటించాలి. లేకపోతే లక్ష్మీదేవికి అమితమైన కోపం వస్తుంది. అలాగే వాస్తు దోషాల కారణంగా లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్లిపోతుంది. మరి ఈ నేపథ్యంలో తులసి మొక్క విషయంలో పాటించవలసిన వాస్తు నియమాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే , వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తులసి మొక్కను నాటాలనుకుంటే కార్తీక మాసం ఉత్తమ సమయం. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు, కార్తీక మాసంలో తులసి మొక్కను తెచ్చి ఇంట్లో నాటితే లక్ష్మీదేవి కూడా ఇంటికి వస్తుందని నమ్మకం.
  2. వాస్తు ప్రకారం తులసి మొక్క ఎల్లప్పుడూ ఇంటికి ఉత్తర లేదా ఈశాన్య దిశలో నాటాలి. ఈ దిశలో దేవతలు నివసిస్తారని చెబుతారు. అలాగే తులసి మొక్కను ఈశాన్యంలో కూడా నాటవచ్చు.
  3. అలాగే తప్పక గుర్తుంచుకోవలసిన విషయం.. తులసి మొక్కలను ఇంటికి దక్షిణ దిశలో నాటకూడదు. ఈ దిక్కు పూర్వీకులది, ఇక్కడ తులసి మొక్కను నాటితే తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతుంది.
  4. మీకు కావాలంటే తులసి మొక్కను ఇంటి బాల్కనీ లేదా కిటికీలో నాటుకోవచ్చు. కానీ వాస్తు శాస్త్రంలో ఇచ్చిన దిశను గమనించి మాత్రమే ఈ పనిచేయాలి. తులసి మొక్కను ఇంటి ముఖద్వారం వద్ద లేదా చెత్తను ఉంచే ప్రదేశంలో లేదా బూట్లు తీసే ప్రదేశంలో ఎప్పుడూ నాటకూడదు.
  5. తులసి మొక్కలను వంటగది లేదా బాత్రూమ్ దగ్గర ఉంచకూడదు. తులసి మొక్కను పూజ గది కిటికీ దగ్గర ఉంచవచ్చు. ఇంకా తులసి మొక్కను అపరిశుభ్రమైన చేతులతో లేదా మురికి చేతులతో తాకకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీపై కోపంగా ఉంటుంది.
  6. తులసికి సింధూరాన్ని సమర్పించడంలో చాలా గందరగోళం ఉంది, కానీ వాస్తు శాస్త్రం ప్రకారం తులసికి సింధూరాన్ని సమర్పించవచ్చు.
  7. తులసి మొక్కను ఎల్లప్పుడూ మట్టి కుండలో ఉంచండి. ప్లాస్టిక్ కంటైనర్లను ఎప్పుడూ ఉపయోగించవద్దు. వీలైతే తులసి పాత్రలో సున్నం లేదా పసుపుతో ‘శ్రీకృష్ణ’ అని రాయండి.
  8. తులసి మొక్క కృష్ణుడి రూపంగా పేర్కొనే బుధుడిని సూచిస్తుంది. కాబట్టి ఏకాదశి రోజు, చంద్ర, సూర్యగ్రహణం రోజుల్లో తులసిని తాకకూడదు.
  9. తులసికి నీళ్ళు సమర్పించడమే కాకుండా పచ్చి పాలను కూడా సమర్పించవచ్చు. పచ్చి పాలు ఇవ్వడం వల్ల దురదృష్టం తొలగిపోతుందని నమ్ముతారు.
  10. మీరు రోజూ తులసికి ప్రదక్షిణలు చేయాలనుకుంటే, నీరు సమర్పించేటప్పుడు తులసి మొక్కకు మూడుసార్లు ప్రదక్షిణలు చేయండి. ముందుగా సూర్యునికి నీళ్ళు, తులసికి నీళ్ళు సమర్పించండి.
  11. తులసికి నీటిని సమర్పించేటప్పుడు, మీరు ‘మహాప్రసాద జననీ, సర్వ సౌభాగ్యవర్ధిని, ఆది మాద్ హర నిత్యం, తులసీ త్వం నమోస్తుతే’ అనే ఈ మంత్రాన్ని జపించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).