Andhra Pradesh: హోంశాఖ సమీక్షలో సీఎం జగన్‌ కీలక ప్రకటన.. ‘వారి వేధింపులకు అడ్డుకట్ట’ వేయాలంటూ..

‘జీవో నెం1పై ప్రత్యేక చర్యలు చేపట్టండి..సోషల్ మీడియా వేధింపులకు తావులేకుండా ప్రత్యేక దృష్టి సారించండి’ అంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. డ్రగ్స్ రవాణా నిర్మూలించి.. పెడలర్స్ పట్ల కఠినంగా వ్యవహారించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. హోంశాఖపై..

Andhra Pradesh: హోంశాఖ సమీక్షలో సీఎం జగన్‌ కీలక ప్రకటన.. ‘వారి వేధింపులకు అడ్డుకట్ట’ వేయాలంటూ..
Andhra Pradesh CM YS Jagan
Follow us

|

Updated on: May 04, 2023 | 9:50 PM

‘జీవో నెం1పై ప్రత్యేక చర్యలు చేపట్టండి..సోషల్ మీడియా వేధింపులకు తావులేకుండా ప్రత్యేక దృష్టి సారించండి’ అంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. డ్రగ్స్ రవాణా నిర్మూలించి.. పెడలర్స్ పట్ల కఠినంగా వ్యవహారించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. హోంశాఖపై రివ్యూలో ఏపీ సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జీవో నెంబ‌ర్‌ 1పై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి.. కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జ‌గ‌న్. జీవో నెంబ‌ర్ 1ను స‌మ‌ర్ధవంతంగా అమ‌లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్లపై మీటింగ్‌ల వల్ల ప్రజలు చనిపోయే పరిస్థితులు ఉండొద్దన్నారు. సభలో తక్కిసలాటపై సీఎం మాట్లాడారు. సభకు హాజరైన తక్కువమందిని ఎక్కువగా చూపించే ప్రయత్నంలో అమాయకుల ప్రాణాలు పోతున్నాయని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో కందుకూరు,గుంటూరు మీటింగ్స్‌లో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ప్రస్తావించారు సీఎం జగన్‌.

మరోవైపు హోంశాఖ సమీక్షలో రాష్ట్రంలో సోషల్‌ మీడియా వేధింపులకు అడ్డుకట్ట పడాలని అధికారులను ఆదేశించారు సీఎం. సోషల్ మీడియా వేధింపులపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులకు కచ్చితమైన ప్రోటోకాల్‌ ఉండాలన్నారు. మహిళా పోలీసులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమగ్ర సమీక్ష చేసి మార్పులు, చేర్పులపై ఆలోచన చేయాలన్నారు. అలాగే దిశ యాప్‌ పై మరోసారి డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. ప్రతి ఇంట్లో కూడా ఈ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకున్నారా? లేదా? అన్నదానిపై అధికారులు మరోసారి పరిశీలన చేయాలని ఆదేశించారు. దిశ యాప్‌ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రతి ఇంటికి క్లుప్తంగా వివరించాలని తెలిపారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక దిశ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.

అలాగే ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్ రహిత రాష్ట్రం తీర్చిదిద్దాలన్నారు సీఎం జగన్. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, మత్తుపదార్థాలను పూర్తిగా నిర్మూలించాలన్నారు. వాటి రవాణా, పంపిణీ, వినియోగంపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. డ్రగ్‌ పెడలర్స్‌ పట్ల కఠినంగా వ్యవహరించడమే కాకుండా.. కఠినమైన శిక్షలు విధించాలని అధికారులకు హోంశాఖ సమీక్షలో సూచించారు సీఎం జగన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..