Solar Eclipse 2021: 72 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.. అరుదైన సూర్యగ్రహం.. ఈ 7 రాశుల వారి దశ తిరిగినట్లే..!

Solar Eclipse: 2021 జూన్ 10న అరుదైన సూర్యగ్రహం ఏర్పడబోతోంది. 72 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ సూర్యగ్రహణం భారత్..

Solar Eclipse 2021: 72 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.. అరుదైన సూర్యగ్రహం.. ఈ 7 రాశుల వారి దశ తిరిగినట్లే..!
Eclipse
Follow us

| Edited By: Phani CH

Updated on: Jun 08, 2021 | 8:25 AM

Solar Eclipse: 2021 జూన్ 10న అరుదైన సూర్యగ్రహం ఏర్పడబోతోంది. 72 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ సూర్యగ్రహణం భారత్ మినహా పలు విదేశాల్లో కనిపించనుంది. జూన్ 10, 2021 కృష్ణ పక్ష అమావాస్య.. ఆస్ట్రేలియా, బెలారస్, బెల్జియం, కెనడా, చైనా, ఘనా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీన్లాండ్, హంగరీ, ఐస్లాండ్, ఐర్లాండ్, ఇటలీ, కజికిస్తాన్, మంగోలియా, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, రష్యా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, అమెరికా, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల్లో సూర్యగ్రహణం ప్రభావం ఉంటుంది.

భారతదేశంపై సూర్యగ్రహణ ప్రభావం ఉంటుందా? జూన్ 10వ తేదీన సంభవించనున్న ఈ సూర్య గ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదని చెబుతున్నారు. అంటే, ఈ సూర్యగ్రహణం దోష ఫలితాలు దేశంపై ప్రభావం చూపబోవట. ఆ కారణంగానే దేశంలోని అన్ని దేవాలయాలు తెరుచుకునే ఉంటాయి. ఇళ్ళు, దేవాలయాలలో పూజలు యాధావిధిగా నిర్వహించబడుతాయి. ఈ సూర్యగ్రహణం వల్ల మన దేశంలో ఎలాంటి దుష్ప్రభావాలు కలుగవని పండితులు చెబుతున్నారు. ఈ సూర్యగ్రహణంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు. అయితే, గర్బిణీ స్త్రీలు కొంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఈ 7 రాశుల వారికి రాజయోగం.. 72 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడే ఈ సూర్యగ్రహణంపై శని, బుధుడు తిరోగమనం చెందుతారు. దీంతో పాటు.. సూర్యుడు, బుధుడు, చంద్రుడు, రాహు ల శుభ కలయిక కూడా ఏర్పడుతోంది. ఇది చాలా అరుదైన కలయిక. ఇది కాకుండా.. శని జయంతి, సావిత్రి ఉపవాసం కూడా 2021 జూన్ 10న ఉంది. అందుకే ఈ రోజు ఎంతో విశిష్టమైనది. ఇదిలాఉంటే.. ఈ సూర్రగ్రహణం ఫలితంగా 7 రాశుల వారిపై మంచి ప్రభావం ఉంటుంది. మేషం, మిధున, కర్కాటక రాశి, కన్య, మీనం, తుల, మకరం వారికి రాజయోగం కలుగనుందని జ్యోతిష్కులు చెబుతున్నారు.

21 వ శతాబ్దపు మొదటి సూర్యగ్రహణం.. ఈ గ్రహణం రింగ్ ఆఫ్ ఫైర్‌గా కనిపిస్తుంది. దీనిని కంకణాకృతి సూర్యగ్రహణం అని కూడా అంటారు. ఈ సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు 94 శాతం సూర్యుడిని కవర్ చేస్తాడు. దీనిని పాక్షిక సూర్యగ్రహణం అని కూడా అంటారు. ఇది భారతదేశంలో కనిపించదు. అందువల్ల ఈ సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం అవుతుంది. గ్రహణం కనిపించే చోట.. దాని దుష్ప్రభాలూ ఉంటాయి. గ్రహణం కనిపించని చోట దాని ప్రభావం ఉండదు. ఇది 21 వ శతాబ్దపు ఏకైక గ్రహణం. ఇది ఉత్తర ధ్రువంలో కనిపిస్తుంది. కాగా, ఈ గ్రహణం వలన కలిగే చెడు ప్రభావాలు ప్రపంచ వ్యాప్తంగా 6 నెలల పాటు కనిపిస్తాయి.

Also read:

Old Currency Notes: పాత 500 రూపాయల నోట్‌తో రూ. 10 వేలు సంపాదించొచ్చు.. అదెలాగంటే..

Latest Articles