Ganga River : గంగానదిలో అస్తికలు కలిపేందుకు పోస్టల్‌ శాఖ వినూత్న ప్రయోగం, ​ఓమ్​ దివ్య దర్శన్ ద్వారా మరణానంతర క్రతువు

భారతీయ పోస్టల్ శాఖ వినూత్నంగా చనిపోయినవారి అస్తికలను గంగానదిలో కలిపేందుకు ఒక నూతన విధానానం తీసుకొచ్చింది. స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా..

Ganga River : గంగానదిలో అస్తికలు కలిపేందుకు పోస్టల్‌ శాఖ వినూత్న ప్రయోగం,  ​ఓమ్​ దివ్య దర్శన్ ద్వారా మరణానంతర క్రతువు
Immersion Of Ashes
Follow us

|

Updated on: Jun 08, 2021 | 8:27 AM

Post death rituals : కరోనా విలయ తాండవం, లాక్ డౌన్ల నేపథ్యంలో చనిపోయిన వారికి మరణానంతర క్రతువులు నిర్వహించడం కూడా కష్టంగా మారింది. మృతి చెందిన వారి అస్తికలను గంగానదిలో కలపడాన్ని హిందువులు పవిత్రమైనదిగా భావిస్తుండటం తెలిసిందే. దీంతో భారతీయ పోస్టల్ శాఖ వినూత్నంగా చనిపోయినవారి అస్తికలను గంగానదిలో కలిపేందుకు ఒక నూతన విధానానం తీసుకొచ్చింది. స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా అస్తికలు పంపితే.. వారణాసి, ప్రయాగ్‌రాజ్‌, హరిద్వార్‌, గయలోని గంగానదిలో కలిపేందుకు ఏర్పాట్లు చేసింది. వారణాసిలోని ఓమ్​ దివ్య దర్శన్ అనే సామాజిక సేవాసంస్థతో కలిసి సంయుక్తంగా స్పీడ్ పోస్ట్ విధానాన్ని ప్రారంభించింది.

తద్వారా.. దేశంలో ఎక్కడి నుంచైనా అస్థికలను స్పీడ్ పోస్ట్ ద్వారా ​ఓమ్​ దివ్య దర్శన్ కార్యాలయానికి పంపించవచ్చు. వీటిని ఎన్​జీఓ సిబ్బంది.. వారణాసి, ప్రయాగ్​రాజ్​, హరిద్వార్​, గయాలో నిమజ్జనం చేస్తారు. అయితే స్పీడ్ పోస్ట్ చేసేవారు ముందుగా ఓమ్​ దివ్య దర్శన్ పోర్టల్​లో పేరు నమోదు చేసుకోవాలని వారణాసి పోస్ట్​మాస్టర్ జనరల్ కృష్ణ కుమార్ యాదవ్ తెలిపారు.

శాస్త్రోక్తంగా.. ఓమ్​ దివ్య దర్శన్ సేవాసంస్థ సభ్యులు అస్థికలు నిమజ్జనం చేస్తారని కృష్ణకుమార్ యాదవ్ వివరించారు. ఈ కార్యక్రమం తర్వాత ఒక బాటిల్లో గంగానది నీటిని తిరిగి.. ఆయా కుటుంబ సభ్యులకు పోస్ట్ ద్వారా పంపిస్తారని వెల్లడించారు.

Read also : Sanjana Galrani : అన్నార్తులకు కొవిడ్ వేళ సినీనటి సంజన గల్రానీ ఆపన్నహస్తం.. దాదాపు నెల్లాళ్లుగా ఉచిత భోజన సేవ