Horoscope Today: ఈరోజు ఈ రాశుల వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. మంగళవారం రాశి ఫలాలు..
Horoscope Today On June 8th 2021: ఈ ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
Horoscope Today On June 8th 2021: ఈ ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు ఎక్కువగానే ఉన్నారు. రోజు తమ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈరోజు (జూన్ 8న) మంగళవారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి.. ఈరోజు వీరు శక్తికి మించిన పనులు ఏమాత్రం చేయకూడదు. అంతేకాకుండా.. జాగ్రత్తలు తీసుకోవాలి. శివాలయంలో అభిషేకం చేయించుకోవడం మంచిది.
వృషభ రాశి.. ఈరోజు వీరికి వేరు వేరు రూపాల్లో పరిశోధన, రచనా సంబంధమైన అంశాల్లో ఆసక్తి పెరుగుతుంటుంది. గణపతిని ఉపాసన చేసుకోవడం మంచిది.
మిథున రాశి.. ఈరోజు వీరు ఇతరులతో వ్యవహరించే సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం కూడా మంచిది. పార్వతి అమ్మవారి అర్చన మేలు చేస్తుంది.
కర్కాటక రాశి.. ఈరోజు వీరు వేరు వేరు రూపాల్లో చేపట్టినటువంటి పనులలో ఏమాత్రం తొందరపడకూడదు. అలాగే జ్ఞాపకశక్తి విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. దత్తాత్రేయ స్వామి ఆరాదన మేలు చేస్తుంది.
సింహరాశి.. ఈరోజు వీరికి అనారోగ్య సంబంధమైన భావనలు ఏర్పడుతుంటాయి. తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ధన్వంతరి స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కన్యరాశి.. ఈరోజు వీరు చేపట్టినటువంటి పనులలో ఏమాత్రం అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. పెట్టుబడుల విషయంలో శ్రమకు మించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సుదర్శన స్వామి అర్చన మేలు చేస్తుంది.
తులా రాశి.. ఈరోజు వీరు చేపట్టినటువంటి కొన్న పనులు ఆలస్యం కావచ్చు. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటే శుభ ఫలితాలను పొందుతారు. పసుపు రంగులో ఉన్న పుష్పాలను సేకరించి దత్తాత్రేయ స్వామి వారికి అర్చన నిర్వహించాలి.
వృశ్చిక రాశి.. ఈరోజు వీరికి ఆహార విహారాదులలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల అనారోగ్య సంబంధమైన భావనలు ఏర్పడుతుంటాయి. హానుమాన్ చాలిసా పారాయణం మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి.. ఈరోజు వీరు ఇతరులతో వ్యవహరించే సందర్భంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మధ్యవర్తిత్వం వహించే సందర్భంలో శక్తికి మించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నవగ్రహా స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
మకర రాశి.. ఈరోజు వీరు విశ్రాంతి కోసం ప్రయత్నం చేస్తుంటారు. దూరప్రాంతాలలో ఉన్న స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. సప్తశ్లోకి పారాయణం మేలు చేస్తుంది.
మీనరాశి.. ఈరోజు వీరు తమ వద్ద పనిచేస్తున్నవారి యొక్క బాగోగులు చూసుకోవడం మంచిది. ఆపదలో ఉన్నటువంటివారిని ఆదుకోవాల్సిన సమయం మీకు ఎదురవుతుంది. విశేషమైన శుభఫలితాలు పొందే సమయంలో పేదవారికి అన్నవస్త్రాలు అందించడం మంచిది.
Banks Privatization: మరో సంచలనం దిశగా కేంద్రం అడుగులు!.. ఎస్‌బిఐని కూడా ప్రైవేటీకరించబోతున్నారా?..