Sanjana Galrani : అన్నార్తులకు కొవిడ్ వేళ సినీనటి సంజన గల్రానీ ఆపన్నహస్తం.. దాదాపు నెల్లాళ్లుగా ఉచిత భోజన సేవ
ఈ క్రమంలో తాను బాగా అలసిపోతున్నాని.. అయినాకాని, తనకు ఈ సమయంలో రెస్ట్ తీసుకునే హక్కు లేదని భావిస్తున్నానని సంజన గల్రాని అన్నారు
Actress Sanjana Galrani Humanity : కరోనా మహమ్మారి విజృంభణ, వరుస లాక్ డౌన్లతో పేద, మధ్యతరగతి బ్రతుకులు కష్టాల కడలిలో మునిగిపోతున్నాయి. అయితే, ఈ కష్ట సమయంలో మీకు మేమున్నామంటూ ఎంతోమంది మానవతామూర్తులు ముందుకొచ్చి తమకు తోచిన రీతిలో సాయం అందిస్తున్నారు. ఇలానే దక్షిణాది సినీనటి సంజన గల్రాని కూడా తన వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. కర్నాటకలోని ఎంతో మంది అన్నార్తులకు దాదాపు నెల రోజులుగా ఆకలి తీరుస్తున్నారు. వాస్తవానికి ఒక్క కప్ టీ కూడా సరిగా చేయడం రాని తనను ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు ఇంత ముందుకు తీసుకెళ్తున్నాయని సంజన తెలిపారు. రోజూ వెయ్యి మందికి పైగా భోజనం అందిస్తున్నామని.. బెంగళూరు హెచ్ఎల్ అన్నసంద్రపాలన ప్రాంతంలో రోజూ ఐదు వందల మందికి, తన ఇంటి దగ్గర్లో 500 మందికి ఉచితంగా భోజనం అందిస్తున్నానని పేర్కొంది. కర్నాటకలో లాక్ డౌన్ ఈ నెల 14వరకూ ఉన్నందున అప్పటి వరకూ ఉచిత భోజనం అందిస్తామని పేర్కొంది.
ఈ క్రమంలో తాను బాగా అలసిపోతున్నాని.. అయినాకాని, తనకు ఈ సమయంలో రెస్ట్ తీసుకునే హక్కు లేదని భావిస్తున్నానని సంజన గల్రాని అన్నారు. ప్రతీ రోజూ భోజనానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని ఆమె చెప్పారు. ఆర్థోపెడిక్ డాక్టర్ కిరణ్ వంట వాళ్లని పంపి తనకు సాయం అందించారని ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాగా, సంజన గల్రాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాగుతోన్న అన్నదాన కార్యక్రమం నిన్నటికి 22 రోజులకు చేరింది. ఇంతకుముందు కూడా సంజన పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేయడం.. సినీ పరిశ్రమకు చెందిన కార్మికులకు సహాయపడ్డం వంటి పలు సేవా కార్యక్రమాలు చేసింది.
ఈ సందర్భంగా ఆమె.. నిరంతరంగా సేవలందిస్తోన్న తమ ఫౌండేషన్ వాలంటీర్లకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. కాగా, తెలుగులో పూరి జగన్నాథ్ – ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బుజ్జిగాడు’సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సంజన. ఈ సినిమా తర్వాత ‘సత్యమేవ జయతే’, ‘అవును 2’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’తదితర సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కన్నడ పరిశ్రమకే పరిమితమైంది.
Sanjana Galrani 2