Betel Leaves: మంగళవారం హనుమంతుడికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే కలిగే అద్భుత ఫలితాలు
Hanuman-Betel Leaves: రామభక్త హనుమాన్ అంటూ పూజలను అందుకుంటున్నాడు. తనను పూజించే భక్తులు కోరిన కోర్కికలు తీర్చే ఆంజనేయస్వామికి ఐదు అంటే..
Hanuman-Betel Leaves: రామభక్త హనుమాన్ అంటూ పూజలను అందుకుంటున్నాడు. తనను పూజించే భక్తులు కోరిన కోర్కికలు తీర్చే ఆంజనేయస్వామికి ఐదు అంటే అమితమైన ఇష్టం. అందుకనే హనుమంతుడి గుడి చుట్టూ ఐదు ప్రదక్షణలు, ఐదు అరటిపళ్ళు సమర్పించాలని పండితులు చెబుతారు. అయితే మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు ఇస్తాడు. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి పురాణాల్లో ఒక కథ ఉంది.
ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని చెంతకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు.అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.
హనుమంతుడిని ఏ విధంగా తమలపాకులతో పూజిస్తే కలిగే ఫలితాలు కలుగుతాయంటే..
*లేత తమల పాకుల హారాన్ని ఆంజనేయస్వామికి వేస్తె రోగాలతో ఇబ్బందులు పడేవారు త్వరగా ఆరోగ్యంవాంతులవుతారు. * ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె మంత్ర సంభందమైన పీడలు తొలగిపోతాయి. *స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో కలతలు ఉంటె అవి పరిష్క్రరింపబడతాయి. *స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు. *వ్యాపారంలో నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా, దానం చేస్తే వ్యాపారం లాభాలబాట పడుతుంది. *.స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. *శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. *.వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ఆ ఆకులను ప్రసాదంగా తింటూ వుంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి. *.సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె అన్ని కార్యాలలో విజయం సిదిస్తుంది. *హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తె పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది. * కోర్టు వివాదాలను ఎదుర్కొంటున్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి.. ఆ ఆకులను ప్రసాదంగా తింటే జయం మీది అవుతుంది.
Also Read: ఆ గుడి నిండా పాములే.. పూజలు చేస్తే మట్టిని ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఎక్కడుందో తెలుసా..