AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Subramanya Temple: ఆ గుడి నిండా పాములే.. పూజలు చేస్తే మట్టిని ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఎక్కడుందో తెలుసా..

ఎన్నో వేల సంవత్సరాల చరిత్రకలిగిన మన దేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. వాటిల్లో కొన్నింటిని రాజులు, భక్తులు వంశస్థుల తమకున్న దేవుడిపై భక్తిని చాటిచేప్పెందుకు నిర్మించారు. మరికొన్ని దేవాలయాల్లోని దేవతలు స్వయంభులుగా వెలిశారు.. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవుళ్లుగా పూజలు అందుకుంటున్నారు. అటువంటి ఆలయాల్లో ఒకటి కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయం ఒకటి.

Surya Kala
|

Updated on: Jun 06, 2021 | 9:30 PM

Share
కుక్కే శ్రీ సుబ్రమణ్యస్వామి గుడిలో నాగ దేవత ఎప్పుడూ కొలువైవుంటుంది  అని ప్రగాఢ విశ్వాసం. నాగదేవత పరిహారం చేయించుకుని  మహిమాన్వితమైన కుక్కే శ్రీ సుబ్రమణ్యస్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. కుక్కే శ్రీ సుబ్రమణ్యస్వామి వారి గుడి నాగదోషపరిహారములకు చాలా ప్రసిద్ధమైనది.ఇక్కడ ప్రధానంగా సర్పహత్యాదోషం, ఆశ్లేష బలి పూజ మరియు నాగప్రతిష్టపూజలు చాలా నిష్టగా నిర్వహిస్తారు.

1 / 7

కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని సుల్లియా అనే వూర్లో కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయం వుంది. ఈ ఆలయం ప్రాకృతిక సౌందర్యాల మధ్య కుమారపర్వత శ్రేణులమధ్య ధారా నది ఒడ్డున వున్న గ్రామం 'సుబ్రహ్మణ్యం'లో వుంది. సుబ్రమణ్యస్వామిని ఇక్కడ నాగదేవతగా ఆరాధించటం విశేషం.

2 / 7
పూర్వం ఈ గ్రామాన్ని 'కుక్కె పట్నం' అని పిలిచేవారు.క్రమంగా ఇది కుక్కె సుబ్రహ్మణ్య'గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ నాగదోషపరిహారములు చేసుకుంటే వారికి జీవితంలో కష్టాలుండవని సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.

3 / 7
కార్తికేయుడికి నిలయమైన ఈ క్షేత్రాలలో పరశురామక్షేత్రం ఒకటి.  'స్కాందపురాణం'లో సనత్ కుమారసంహితలోని.. 'సహ్యాద్రికాండ'లోని తీర్ధక్షేత్ర మహామణి పురాణంలో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది.

4 / 7
పూర్వం తారకుడు, సూర్పర్మాసురా అనే అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించాడు. తన ఆయుధాన్ని ఇక్కడి ధారానదిలో శుభ్రపరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ పర్వతశ్రేణుల్లో కార్తికేయుడు ఇంద్రుడు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో కార్తికేయుడు వెలసినందున ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది.

5 / 7
సుబ్రమణ్యస్వామి ముఖద్వారం తూర్పుముఖమై ఉన్నా, భక్తులు మాత్రం పృష్టభాగం నుండి ముందుకు వెళ్లి స్వామి దర్శనం చేసుకోవలసి ఉంటుంది.  గర్భాలయానికి, మండపద్వారానికి మధ్య వెండితో కప్పబడిన గరుడస్థంభం వుంది.

6 / 7
వాసుకి విషపు బుసలనుండి రక్షింపపడడానికి గరుడ స్థంభం నిర్మించారు అని ప్రతీతి. ఈ స్తంభాన్ని దాటిన తరువాత లోపలి మంటపం చేరుకోగానే గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టు సాక్షాత్కరిస్తాడు. పైభాగంలో సుబ్రమణ్యస్వామి,మధ్య భాగంలో వాసుకి, క్రిందిభాగంలో ఆదిశేషుడు వుంటారు.

7 / 7