Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayasai Reddy : ‘గారడీలతో నెట్టుకొచ్చినా.. జనాగ్రహ జ్వాలల్లో మాడి మసై పోవాల్సిందే. కాలగర్భంలో కలిసి పోవాల్సిందే’

MP Vijayasai Reddy slams chandrababu and lokesh : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లపై విరుచుకుపడ్డారు.

Vijayasai Reddy : 'గారడీలతో నెట్టుకొచ్చినా..  జనాగ్రహ జ్వాలల్లో మాడి మసై పోవాల్సిందే. కాలగర్భంలో కలిసి పోవాల్సిందే'
Vijayasai Reddy
Follow us
Venkata Narayana

|

Updated on: May 22, 2021 | 3:05 PM

MP Vijayasai Reddy on  chandrababu and lokesh : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లపై విరుచుకుపడ్డారు. ప్రజా క్షేత్రంలో వాతలు పెట్టించుకుని రాష్ట్రంలో కాలుమోపే ధైర్యం లేని తండ్రీ కొడుకులను ఎన్ని జాకీలు పెట్టి లేపాలని చూసినా ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. గారడీ విద్యలతో కొన్నాళ్లు నెట్టుకురాగలిగినా.. చివరకు జనాగ్రహ జ్వాలల్లో మాడి మసై పోవాల్సిందే. కాలగర్భంలో కలిసి పోక తప్పదు. అంటూ విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదిగా ఆయన చంద్రబాబు, లోకేష్ లపై మళ్లీ ఇవాళ సెటైర్లు వేశారు. చంద్రబాబు ఒక స్వయం ప్రకటిత కింగ్ మేకర్ అంటూ ప్రకటించిన విజయసాయి, అతనే ఫార్మా హబ్ నిర్మించానని చెబుతాడు.. అయితే, ఒక్క వ్యక్తికి కూడా ఒక మోతాదు వ్యాక్సిన్ పొందడానికి సహాయం చేయలేదు. ఇంతకీ.. అతను, అతని కొడుకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా.. అనే విషయం ఇంకా చెప్పలేదంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

కాగా, గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాన్ని బాయ్ కాట్ చేసి టీడీపీ నిర్వహించిన మాక్ అసెంబ్లీ మీద కూడా విజయసాయి తనదైన శైలిలో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. “ఏమి నాటకాలయ్యా చంద్రం! అందుకే మీది తెలుగు డ్రామా పార్టీ అన్నది. అసెంబ్లీకి డుమ్మాకొట్టి తెలంగాణ నుంచి జూమ్ లో అసెంబ్లీ పెట్టేశాడు. పచ్చ నేతలే స్పీకర్ – మంత్రులట! ఇంకా ఢిల్లీలో చక్రం తిప్పేస్తున్నానన్న భ్రమల్లోనే ఉన్నాడు. ఇంతకీ పుత్రరత్నం లోకేశంకి ఏం మంత్రి పదవిచ్చాడో బాబు?” అంటూ వైసీపీ ఎంపీ విమర్శలు గుప్పించారు.