AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం..? ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాటం..! నిజమెంతా..?

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై మరోసారి తీవ్రస్థాయిలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వాదనలను ఇరాన్ ప్రభుత్వం గానీ అధికారిక ఆరోగ్య సంస్థలు కానీ ఇప్పటివరకు ధృవీకరించలేదు.

ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం..? ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాటం..! నిజమెంతా..?
Iran Supreme Leader Mojtaba Khamenei
Balaraju Goud
|

Updated on: Aug 08, 2026 | 8:52 AM

Share

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై మరోసారి తీవ్రస్థాయిలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వాదనలను ఇరాన్ ప్రభుత్వం గానీ అధికారిక ఆరోగ్య సంస్థలు కానీ ఇప్పటివరకు ధృవీకరించలేదు. తాజాగా ఇరాన్‌వైర్ ఉటంకిస్తూ వచ్చిన కథనాల్లో.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ సర్కార్‌కు సన్నిహితంగా ఉన్న రెండు వర్గాలు మొజ్తబా ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఆయన మరణం సంభవించినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆ వర్గాలు భావిస్తున్నట్లు చెబుతున్నాయి. అయితే ఈ సమాచారం స్వతంత్రంగా ధృవీకరించడంలేదు.

బహిరంగంగా కనిపించని సుప్రీం లీడర్

2026 ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ సర్వోన్నత నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కీలక సందర్భాల్లోనూ ప్రత్యక్ష ప్రసంగాలకు దూరంగా ఉండి, లిఖితపూర్వక సందేశాల ద్వారానే స్పందించడం ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలకు కారణమైంది.

దాడుల్లో గాయపడ్డారన్న ప్రచారం

మొజ్తబా ఖమేనీ తన తండ్రిని లక్ష్యంగా చేసుకున్న దాడుల్లోనే గాయపడ్డారని గతంలో పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని, భద్రతా కారణాలతో రహస్య ప్రదేశంలో ఉంచారని కూడా కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ వివరాల్లో చాలా వరకు స్వతంత్ర ధృవీకరణకు నోచుకోలేదు. మార్చిలోనే ఆయన ఆరోగ్యం, నాయకత్వ సామర్థ్యంపై ఇజ్రాయెల్ వర్గాలను ఉటంకిస్తూ పలు కథనాలు వెలువడ్డాయి.

ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇదిలావుంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం జూలైలో మొజ్తబా ఖమేనీ పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అమెరికా దాడుల ప్రభావాన్ని వివరిస్తూ.. మొజ్తబా “90% gone” అంటూ వ్యాఖ్యానించినట్లు ఫాక్స్ న్యూస్, ఇతర మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే ఇది ట్రంప్ చేసిన రాజకీయ వ్యాఖ్య మాత్రమేనని, దీనికి స్వతంత్ర వైద్యపరమైన ధృవీకరణ లేదని గుర్తించాలి.

ఇరాన్ నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు?

తాజా ఆసుపత్రి కథనాల నేపథ్యంలో ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మొజ్తబా ఖమేనీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేకపోవడంతో ఊహాగానాలు మరింత పెరుగుతున్నాయి. ఒకవైపు ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారన్న వార్తలు వస్తుండగా.. మరోవైపు ఇరాన్ అధికారిక వ్యవస్థ నుంచి ధృవీకరణ లేకపోవడం పరిస్థితిని మరింత అనిశ్చితంగా మార్చింది.

మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి నిజంగా ఎంత తీవ్రంగా ఉంది? ఆయన ఆసుపత్రిలో ఉన్నారా? అనే ప్రశ్నలకు అధికారిక ప్రకటన వెలువడే వరకు స్పష్టమైన సమాధానం లభించే అవకాశం లేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ఆధారంగా చూస్తే.. ఆయన పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలు తీవ్రంగా ప్రచారంలో ఉన్నప్పటికీ, అవి ఇంకా ధృవీకరించని వాదనలుగానే ఉన్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..
30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..
కార్తీక మాసంలో .. వీరు ఏం చేసినా విజయమే.. ముట్టింది ముత్యమే
కార్తీక మాసంలో .. వీరు ఏం చేసినా విజయమే.. ముట్టింది ముత్యమే
నవంబర్ 2026 సింహ రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో పదోన్నతి, జీతాల పెంపు
నవంబర్ 2026 సింహ రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో పదోన్నతి, జీతాల పెంపు