చైనా పేరు మార్చితే.. భారత్ మ్యాప్ మార్చింది! 27 ప్రాంతాలపై డ్రాగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్
అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా పదేపదే కొత్త పేర్లు పెడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని 27 ప్రాంతాలు, భౌగోళిక స్వరూపాలకు వాటి ప్రామాణిక పేర్లను అధికారిక భారత పటంలో లాంఛనంగా గుర్తించింది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో ఈ పేర్లను అధికారికంగా నమోదు చేసింది. ఆయా ప్రాంతాలను స్పష్టంగా గుర్తించడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని కేంద్రం తెలిపింది.

అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా పదేపదే కొత్త పేర్లు పెడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని 27 ప్రాంతాలు, భౌగోళిక స్వరూపాలకు వాటి ప్రామాణిక పేర్లను అధికారిక భారత పటంలో లాంఛనంగా గుర్తించింది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో ఈ పేర్లను అధికారికంగా నమోదు చేసింది. ఆయా ప్రాంతాలను స్పష్టంగా గుర్తించడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని కేంద్రం తెలిపింది.
భారత్ తీసుకున్న ఈ నిర్ణయం చైనా చర్యలకు వ్యూహాత్మక సమాధానం ఇచ్చినట్లు అయ్యింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్ గతంలోనూ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇలాంటి పేర్ల మార్పులు వాస్తవ పరిస్థితిని మార్చలేవని, అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగంగా కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేస్తూ వచ్చింది.
సరిహద్దు ఘర్షణలకు సాక్ష్యాలైన ప్రాంతాలూ..
భారత్ అధికారికంగా గుర్తించిన 27 ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలోని లాంగ్ జు కూడా ఈ జాబితాలో ఉంది. 1959లో చైనా దళాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించడంతో భారత్–చైనా మధ్య ప్రారంభ ఘర్షణలకు ఇది ఒక ముఖ్య కేంద్రంగా నిలిచింది. అప్పర్ సుబన్సిరి జిల్లాలోని లాంగ్ జు సమీపంలోని మాజా గ్రామం కూడా అధికారిక మ్యాప్‌లో గుర్తింపు పొందింది. అదేవిధంగా వ్యూహాత్మకంగా కీలకమైన బీసా, జో లా, రిజా లా, పుకుర్ లా వంటి ఎత్తైన ప్రాంతాలు, పర్వత మార్గాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. 1962 భారత్–చైనా యుద్ధంలో కీలక ఘట్టాలకు వేదికైన థాగ్ లాకు కూడా అధికారిక గుర్తింపు లభించింది. దీంతో చారిత్రకంగా, సైనికంగా ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలకు భారత మ్యాప్‌లో మరింత స్పష్టమైన గుర్తింపు లభించినట్లైంది.
జైరాంపూర్ నుంచి అమరవీరుల స్మారకాలకు..
చాంగ్లాంగ్ జిల్లాలోని జైరాంపూర్ కూడా ఈ జాబితాలో ఉంది. తూర్పు అరుణాచల్, మయన్మార్ సరిహద్దు వైపు భద్రతా దళాల కదలికలకు ఇది కీలక లాజిస్టిక్స్ కేంద్రంగా పరిగణిస్తారు. అలాగే ఎత్తైన సరస్సైన శంభో సరోవర్, బారా కుందూన్, ఛోటా కుందూన్, ధన్ బారీ, ప్రిత్‌నగర్, టెరిట్‌నగర్, రామ్‌నగర్, సాగర్, పద్మా, జ్యోతినగర్, బైసాకినగర్ వంటి ప్రాంతాలకు కూడా అధికారిక మ్యాప్‌లో చోటు కల్పించారు. 1962 యుద్ధ వీరుడు జస్వంత్ సింగ్ రావత్ స్మారక చిహ్నం, త్రిలోక్ సింగ్ థాపాను స్మరించుకునే షేర్-ఎ-థాపా మెమోరియల్, ఛోటా రోపుక్, బారా రోపుక్, శివాజీ నగర్, సన్‌పురా, కమ్లాంగ్ నగర్, బుద్ధమందిర్ వంటి ప్రాంతాలు కూడా జాబితాలో ఉన్నాయి.
చైనా పేర్ల మార్పులకు భారత్ కౌంటర్
అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ‘జాంగ్నాన్’ లేదా ‘దక్షిణ టిబెట్’గా పేర్కొంటూ వస్తోంది. 2017లో ఆరు ప్రాంతాలకు చైనా పేర్లు ప్రకటించగా.. 2021లో మరో 15 ప్రాంతాలకు, 2023లో 11 ప్రాంతాలకు పేర్లు మార్చింది. 2025లోనూ 27 ప్రాంతాలకు కొత్త పేర్లు ప్రకటించింది. ఈ చర్యలను భారత్ నిరంతరం తిరస్కరిస్తోంది. ఇప్పుడు భారత్ తన అధికారిక సర్వే మ్యాప్‌లో 27 ప్రాంతాలకు ప్రామాణిక పేర్లను గుర్తించడం ద్వారా భౌగోళిక, పరిపాలనా గుర్తింపును మరింత స్పష్టం చేసింది. సరిహద్దు ప్రాంతాలపై చైనా పేరు మార్చే దౌత్యం కొనసాగుతున్న వేళ.. భారత మ్యాప్‌లో కీలక ప్రాంతాలకు అధికారిక గుర్తింపు ఇవ్వడం ద్వారా భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసినట్లైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
