ఫొటోలతో సహా చెలరేగిన సజ్జల, చంద్రబాబు కుప్పం పర్యటన, స్వరూపానందస్వామిపై కామెంట్లకు కౌంటర్ అటాక్

Sajjala Ramakrishna reddy : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి పార్టీ నుంచి పోటీ ఉండదని వైఎస్ఆర్ సీపీ నేత, జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పనిలోపనిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై..

ఫొటోలతో సహా చెలరేగిన సజ్జల, చంద్రబాబు కుప్పం పర్యటన, స్వరూపానందస్వామిపై కామెంట్లకు కౌంటర్ అటాక్
Sajjala Ramakrishna Reddy
Follow us

|

Updated on: Feb 25, 2021 | 4:13 PM

Sajjala Ramakrishna reddy : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి పార్టీ నుంచి పోటీ ఉండదని వైఎస్ఆర్ సీపీ నేత, జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పనిలోపనిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫొటోలతో సహా ధ్వజమెత్తే ప్రయత్నం చేశారు. షాక్ తినప్పుడు బాబు ఫేస్ మారిపోతుందన్న ఆయన, అలిపిరి ఘటన తరువాత చంద్రబాబు ఎలా షాక్ తినారో ఇపుడు అలానే షాక్ కి గురయ్యారంటూ ఎద్దేవా చేశారు. బాబు సంస్కారం లేకుండా హుందా గా లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. క్షుద్రపూజలంటున్న స్వరూపానంద స్వామి దగ్గరకి అప్పట్లో చంద్రబాబు కూడా వెళ్లారు ఆయన వియంకుడు బాలకృష్ణ’, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు అందరూ ఆ స్వామి దగ్గర వెళ్లారంటూ ఫొటోలతో సహా చూపించే ప్రయత్నం చేశారు. ఓట్లు వేసింది ప్రజలే కదా ఎందుకు బాబు అంగీకరించడం లేదు. అంటూ చంద్రబాబు కుప్పం యాత్రపై సజ్జల సెటైర్లు వేశారు. జమిలి ఎన్నికలు అని బాబు నోట వస్తున్న మాటలు, కేవలం సాకులు చెప్పి నేతల్ని టీడీపీని వదిలి పెట్టకుండా ఉండేలా చూడడానికి ఈ డ్రామాలు ఆడుతున్నారని సజ్జల విమర్శలు చేశారు.

ఇదిలాఉంటే, ఇవాళ కప్పం వేదికగా ఏపీలో పంచాయితీ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత… సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. కుప్పం కేడర్‌ తీవ్ర నిరాశ, ఆవేదనలో ఉన్న నేపథ్యంలో వారిలో ధైర్యం నింపే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మూడు రోజులు ఆయన ఇక్కడే ఉంటారు. మండలాల వారీగా… కార్యకర్తలతో భేటీకి ప్లాన్‌ చేశారు. అయితే, చంద్రబాబు కుప్పం టూర్‌ ఎప్పుడూ లేనిది ఈసారి టెన్షన్‌ రేపుతోంది. వైసీపీ నేతల వార్నింగ్స్‌తో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇన్నేళ్ల నుంచి నియోజకవర్గానికి చంద్రబాబు చేసిందేమీ లేదని, కరోనా టైమ్‌లోనూ కనీసం జనాన్ని పట్టించుకోలేదని, పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయే సరికి కుప్పం గుర్తుకు వచ్చిందా… అంటూ నిలదీస్తున్నారు వైసీపీ నేతలు.

ప్రతిపక్షనేత చంద్రబాబును వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత టూర్‌లో భద్రతను పెంచారు పోలీసులు. మరోవైపు ఎప్పుడూ లేనిది ఈసారి అధినేత టూర్లో ఎన్టీఆర్‌ ఫ్యామిలీ ఫొటోలు ఆసక్తిగా మారింది. గతంలో చంద్రబాబు ఎప్పుడు వచ్చినా ఆయన ఫొటోలతోనే ఫ్లెక్సీలు పెట్టే వారు. ఇప్పుడు గుడుపల్లిలో పెట్టిన బ్యానర్లలో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణల ఫొటోలు ఉన్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫొటోను కూడా బ్యానర్లలో పెట్టారు. అదే కుప్పంలో టీడీపీలో కొత్త చర్చకు దారితీస్తోంది.

ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబును సొంత ఇలాకాలోనే ఆయనను రాజకీయంగా దెబ్బ తీయాలనే లక్ష్యంతో ఉంది వైసీపీ. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో కొంతమేర సక్సెస్‌ అయింది. ఈ నేపథ్యంలో కుప్పం గడ్డపై టీడీపీ వార్నింగ్‌లు.. వైసీపీ అల్టిమేటమ్‌లు.. హై టెన్షన్‌ క్రియేట్ చేస్తున్నాయి. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు టూర్‌తో అవి మరింత పీక్‌కి వెళ్లాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వబోమన్న వైసీపీ అన్నంత పనిచేస్తుందా? అదే జరిగితే.. తెలుగుతమ్ముళ్లు వైసీపీ శ్రేణులకు ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు? ఈ సందేహాలే ఇప్పుడు సెగలు రేపుతున్నాయి. పోలీసులు మాత్రం సిట్యువేషన్‌ సీరియస్‌గా కాకుండా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.

చంద్రబాబు కుప్పం టూర్‌ టెన్షన్‌ రేపుతోంది. ఇన్నేళ్ల నుంచి ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్క దాన్నీ నెరవేర్చలేదని వైసీపీ ఆరోపిస్తోంది. హంద్రీనీవా నుంచి నీళ్లు తెస్తానని చెప్పి మోసం చేశారని విమర్శించారు. అంతేకాదు చంద్రబాబు ఫ్లెక్సీ దగ్దం చేసి తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. చంద్రబాబు కుప్పానికి వస్తున్న సమయంలో ఈ వార్నింగ్‌ మంటలు మంటపుట్టిస్తున్నాయి. వైసీపీ హెచ్చరికలకు అదే రేంజ్‌లో బదులిచ్చింది టీడీపీ. తమ అధినేతను అడ్డుకోవడం అంత సులువేం కాదని కౌంటర్ ఇచ్చింది. పులివెందుల రాజకీయాలు ఇక్కడ కుదరవని తేల్చిచెప్పింది.

చంద్రబాబు కుప్పానికి వస్తున్నారంటే గతంలో ఓ రేంజ్‌లో స్వాగత ఏర్పాట్లు ఉండేవి. కానీ ఇప్పుడు నిరసనలు స్వాగతం పలికే సీన్లు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఎందుకిలా మారింది..? చంద్రబాబు..కుప్పం. ఈ రెండు పేర్లకు బలమైన బంధం ఏర్పడి దశాబ్దాలవుతోంది. వైఎస్ కుంటుంబానికి పులివెందుల ఎలాగో.. టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం అలాగ. టీడీపీ బాస్‌ ఎక్కడున్నా కనుసైగతో కుప్పంను శాసిస్తారు. అక్కడ ఆయన మాటే వేదం.. శాసనం. అలాంటిది 2019 ఎన్నికల నుంచి అక్కడ టీడీపీ హవా తగ్గుతూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు మెజార్టీ తగ్గడం.. ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఫ్యాన్ హవాతో సమీకరణాలు మారినట్టు కనిపిస్తోంది. పరిస్థితి చేజారకుండా కేడర్‌కు దిశానిర్దేశం చేసేందుకే చంద్రబాబు సొంత ఇలాఖాకు వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

నిజానికి అసెంబ్లీ ఎన్నికల నుంచి కుప్పంలో స్పెషల్‌ ఎఫెర్ట్‌ పెట్టిన వైసీపీ.. పంచాయతీ ఎన్నికల నాటికి వ్యూహం మార్చేసింది. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీలు ఉంటే.. వైసీపీ ఖాతాలో 75 పడ్డాయి. టీడీపీకి 13 దక్కాయి. ఈ ఫిగర్‌ చూసిన తర్వాత టీడీపీ శిబిరంలో కలకలం మొదలైంది. కుప్పంలో ఏం జరుగుతుందా అన్న ఆందోళన మొదలైంది. గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ కాస్త తగ్గినా.. పసుపు జెండా ఎగరడం మాత్రం ఖాయంగా వస్తుంది. ఈ కోటకు బీటలు వేయాడమే లక్ష్యంగా వైసీపీ రచించిన వ్యూహం టీడీపీ శ్రేణులతో పాటు అధినేతకు మైండ్‌ బ్లాంక్‌ చేసినంత పని చేసింది. ఊహకు అందని విధంగా వైసీపీ కుప్పంలో పుంజుకుందా అని ఆశ్చర్యపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇప్పుడు పంచాయతీ ఫలితాలు చూసిన తర్వాత వెంటనే కుప్పం వెళ్లాలని చంద్రబాబు డిసైడైనట్టు తెలుస్తోంది.

Read also : సోషల్ మీడియానే అస్త్రంగా చేసుకున్నాడు, సర్పంచ్ అక్రమాలపై ఎలుగెత్తాడు, దాడులకు ఓర్చి నిలబడ్డ మహబూబ్ నగర్ యువకుడు

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?