- Telugu News Photo Gallery Viral photos Occult worship with skull photos at munagalapadu kurnool district
Black magic: ఇంటిముందు పుర్రెతో క్షుద్రపూజల కలకలం.. భయానకం.. వైరలవుతున్న ఫోటోలు
Occult Practices: కర్నూలు సమీపంలోని మునగాలపాడు గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. మునగాలపాడులో రాములమ్మ అనే మహిళ ఇంటి ముందు మంగళవారం ఉదయం గుర్తుతెలియని దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారు.
Updated on: Feb 25, 2021 | 4:01 PM

ఇంటి ముందు పుర్రెలు, చీపురు, కుంకుమ కనిపించేసరికి ఆ ఇంటి యజమాని కంగారుపడింది. ఆమెపై క్షద్రపూజలు చేశారేమోనని భయపడింది. కర్నూలు సమీపంలోని మునగాలపాడులో ఈ ఘటన జరగగా... పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

పసుపు, కుంకుమ చల్లి పుర్రె, ఎముకలు, నిమ్మకాయలు, చీపురుకట్ట పెట్టారు. ఆమె వాటిని చూసి భయానికి గురైంది. స్థానికులు కంగారుపడ్డారు.

దీంతో గ్రామంలో అనుమానాలు, భయాందోళనలను రేకెత్తాయి. రాములమ్మ సునీల్ అనే వ్యక్తి దగ్గర నెలసరి అద్దెకు ఇల్లు తీసుకొని నివాసముంటూ కూలి పని చేసి జీవనం సాగిస్తున్నారు.

ఇంటి యజమాని సునీల్ మాట్లాడుతూ మాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు ఎవరితోనూ గొడవలు లేవు అయినా నా మా ఇంటి ముందర రుద్ర పూజలు ఎందుకు చేశారు ఎవరు చేశారో మాకు అంతుచిక్కడం లేదని ఒకరకంగా భయం కలుగుతోందన్నారు

మరోవైపు ఇల్లు అద్దెకు తీసుకున్న రాములమ్మ కు ఎవరైనా హాని తల పెట్టడానికి ఈ పని చేసి ఉంటారా అన్న కోణంలో కూడా గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
