సోషల్ మీడియానే అస్త్రంగా చేసుకున్నాడు, సర్పంచ్ అక్రమాలపై ఎలుగెత్తాడు, దాడులకు ఓర్చి నిలబడ్డ మహబూబ్ నగర్ యువకుడు

ఆయనో ప్రజాప్రతినిధి. ప్రజలకు మంచి చేయాల్సిన ఆ పెద్దమనిషి అక్రమాలకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఓ యువకుడు సోషల్‌మీడియా ద్వారా ప్రచారం చేశాడు. ఆగ్రహించిన సదరు పెద్దమనిషి యుకుడిని పట్టుకుని చితకబాదాడు...

సోషల్ మీడియానే అస్త్రంగా చేసుకున్నాడు, సర్పంచ్ అక్రమాలపై ఎలుగెత్తాడు, దాడులకు ఓర్చి నిలబడ్డ మహబూబ్ నగర్ యువకుడు
Follow us

|

Updated on: Feb 25, 2021 | 3:36 PM

ఆయనో ప్రజాప్రతినిధి. ప్రజలకు మంచి చేయాల్సిన ఆ పెద్దమనిషి అక్రమాలకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఓ యువకుడు సోషల్‌మీడియా ద్వారా ప్రచారం చేశాడు. ఆగ్రహించిన సదరు పెద్దమనిషి యుకుడిని పట్టుకుని చితకబాదాడు. ఈ విషయం పోలీస్‌స్టేషన్‌ వరకూ వెళ్లడంతో…అతను రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

మహబూబ్‌నగర్‌జిల్లా జడ్చర్ల మండలం చర్లపల్లికి చెందిన సర్పంచ్‌ శ్రీనివాస్‌…ఉపాధిహామీ పథకం ద్వారా చేయాల్సిన పనులు యంత్రాల ద్వారా చేపట్టాడు. అంతేకాదు గ్రామ సరిహద్దులో ప్రభుత్వ పనులకంటూ చెప్పి మట్టిని అక్రమంగా తరలించి క్యాష్‌ చేసుకుంటున్నాడు. ఈ విషయాన్ని అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌గౌడ్‌ అనే యువకుడు అడ్డుకున్నాడు. సర్పంచ్‌ చేస్తున్న అక్రమాలను సోషల్‌ మీడియా ద్వారా అందరికీ తెలిసేలా ప్రచారం చేశాడు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన సర్పంచ్‌…తనపైనే సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తావా అంటూ..తన అనుచరులతో కలిసి శ్రీనివాస్‌గౌడ్‌ను చితకబాదాడు. ఈ దృశ్యాలన్నీ సిసిటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయ్‌.

గతంలోనూ సర్పంచ్‌ అక్రమాలను ప్రశ్నించినందుకు .. .తన అనుచరులతో బెదిరించాడని బాధితుడు శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు.సర్పంచ్‌పై జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో దిగొచ్చిన సర్పంచ్‌ శ్రీనివాస్‌….అధికారపార్టీ నాయకులతో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారని చెప్పారు.

ఈ పోరు ఇలా ఉంటే, తెలంగాణలోని మంచిర్యాల మున్సిపాలిటీలో కమీషన్ల గొడవలో మరోకోణం తొంగిచూసింది. బిల్లుల చెల్లింపు కోసం మున్సిపల్ అధికారులు కమిషన్లకు కక్కుర్తి పడిన వైనం వెలుగుచూసింది. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు, ఇతర అత్యవసర పనులను టెండర్లు, నామినేషన్ పద్ధతుల్లో కాంట్రాక్టర్లకు అప్పగిస్తుండగా… అధికారులు చేతివాటం ప్రదర్శించారు. వారికి బిల్లులను మంజూరు చేయడంలో బిల్లు మంజూరు చేసే సమయంలో కమీషన్లు ఇవ్వనిదే బిల్లు పాస్ కాదంటూ అడ్డుపడ్డారు. ఇప్పుడు కాంట్రాక్టర్ల మధ్య జరిగిన సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యాం కుమార్‌కు… జేసీబీ కాంట్రాక్టర్ వాషింగ్ మిషన్ నజరానా ఇచ్చారు. సోడియం హైపోక్లో రైడ్ ద్రావణం సరఫరా బిల్లు మంజూరు చేసేందుకు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనిత డబ్బులు డిమాండ్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి కాంట్రాక్టర్ల మధ్య జరిగిన సంభాషణ ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా… మున్సిపాలిటీ ఉద్యోగులకు ఎంత కమీషన్ ఇవ్వాలో తమకు తెలుసునని, ఇష్టమొచ్చినంత ఎలా అడుగుతారని సదరు కాంట్రాక్టర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

అయితే.. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రభుత్వం జిల్లాకు ఏటా రూ. 75.71 లక్షలు నిధులు కేటాయిస్తోంది. వాటిలో సగం వరకు అత్యవసర పనుల నిమిత్తం మంచిర్యాల మున్సిపాలిటీకి విడుదల చేస్తున్నారు. మున్సిపాలిటీకి జేసీబీ లేకపోవడంతో ప్రైవేటు వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే చేసిన పనికంటే బిల్లులు ఎక్కువ రాసి… అందులో కమీషన్లు పంచుకుంటున్నారన్న ఆరోపణలు ముందునుంచీ ఉన్నాయి. తాజా ఆడియో టేపులు బయటపడడంతో అధికారులు విచారణ జరుపుతున్నారు.

Read also : ఇంటిముందు పుర్రె, ఎముకలు, పసుపు కుంకుమ, నిమ్మకాయలు ఉంచి పూజలు, బెంబేలెత్తిపోతోన్న గ్రామస్తులు, కర్నూలు జిల్లాలో గుబులు

Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.