MLC K. Kavitha: ఎమ్మెల్సీ కవిత కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు.. 

MLC K. Kavitha Convoy Accident : మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కే. కవిత కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. గురువారం జగిత్యాలలో..

MLC K. Kavitha: ఎమ్మెల్సీ కవిత కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు.. 
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 25, 2021 | 10:17 PM

MLC K. Kavitha Convoy Accident: మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కే. కవిత కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. గురువారం జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత కాన్వాయ్‌లోని మూడు కార్లు ఒకదానికొకటి ఢికొన్నాయి. అయితే ఎమ్మెల్సీ కవిత సురక్షితంగా ఉన్నారని.. ఎలాంటి గాయాలు కాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొండగట్టు నుంచి రాయికల్ వెళ్లే క్రమంలో మల్యాల మండలంలోని రాజారాం గ్రామం దగ్గర కవిత ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ముందుకారు అదుపు తప్పింది. ఈ క్రమంలో ఒకేసారి బ్రెకులు వేయడంతో వెనకగా వస్తున్న ఐదు కార్లు ఒకదానికొకటి ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ కవితతోపాటు.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కార్లు ఒకదానికొకటి ఢీకొని స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ తర్వాత వేరే కారులో కవిత బయలుదేరి వెళ్లారు. కవితకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో పార్టీ నాయకులు, అభిమానులు అంతా ఊపిరిపీల్చుకున్నారు.

కవిత గురువారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. రాయికల్‌ మండలం కొత్తపేట గ్రామంలోని నాగాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామిని కూడా కవిత దర్శించుకున్నారు. ఆ తర్వాత కొండగట్టు నుంచి రాయికల్ వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది.

Also Read:

Nirav Modi: నీరవ్ మోదీకి షాక్.. ఆధారాలు రుజువయ్యాయి.. భారత్‌కు అప్పగించండి: యూకే కోర్టు సంచలన తీర్పు