Nirav Modi: నీరవ్ మోదీకి షాక్.. ఆధారాలు రుజువయ్యాయి.. భారత్‌కు అప్పగించండి: యూకే కోర్టు సంచలన తీర్పు
Nirav Modi: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.14వేల కోట్లు ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి అక్కడి కోర్టు నుంచి చుక్కెదురైంది. నీరవ్‌పై మనీలాండరింగ్ అభియోగాలు రుజువయ్యాయని యూకే కోర్టు..
Nirav Modi: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.14వేల కోట్లు ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి అక్కడి కోర్టు నుంచి చుక్కెదురైంది. నీరవ్‌పై మనీలాండరింగ్ అభియోగాలు రుజువయ్యాయని యూకే కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు గురువారం లండన్ కోర్టులో నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలన్న విషయంపై విచారణ జరిగింది. మనీ ల్యాండరింగ్, పీఎన్‌బీ బ్యాంకుకు 14వేలు ఎగ్గొట్టిన కేసులో అన్ని ఆధారాలు రుజువైనందున నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలని లండన్ కోర్టు తీర్పు వెలువరించింది. భారత్‌కు అప్పగించినా నీరవ్‌కు అన్యాయం జరగదంటూ బ్రిటన్ కోర్టు పేర్కొంది. అలాగే నీరవ్ మానసిక స్థితి సరిగా లేదన్న వాదననూ కొట్టి పారేస్తూ లండన్ కోర్టు తీర్పును వెలువరించింది.
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసుపై రెండున్నర ఏళ్లుగా యూకే కోర్టులో విచారణ జరుగుతోంది. మోసం, మనీల్యాండరింగ్ కింద అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ఆయన్ను వాండ్స్‌వర్త్ జైలు నుంచి అధికారులు మెజిస్ట్రేట్ కోర్టు విచారణకు హాజరుపర్చారు. ఈ కేసును విచారించిన డిస్ట్రిక్ జడ్జి సామ్యూల్ గూజీ ఈ విధంగా తీర్పును వెలువరించారు. అయితే మనీల్యాండరింగ్ కేసులో నీరవ్ మోదీని దోషిగా తేల్చేందుకు కావాల్సిన సాక్ష్యాధారాలు ఉన్నట్లు న్యాయస్థానం పేర్కొంది. అయితే మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును యూకే హోంశాఖ మంత్రి ప్రీతిపాటిల్‌కు తెలియజేయనుంది.
పీఎన్‌బీకి 14వేల కోట్లు ఎగవేసిన కేసులో నీరవ్‌ను అప్పగించాలని బ్రిటన్‌ను భారత్ కొన్నెళ్లుగా కోరుతున్న విషయం తెలిసిందే. నీరవ్‌కు వ్యతిరేకంగా భారత్ తమకు 16 సంపుటాల ఆధారాలను సమర్పించిందని, భారత ప్రభుత్వం సమర్పించిన ఆధారాలను గుర్తించినట్లు జడ్జి సామ్యూల్ వెల్లడించారు.