Sunny leone: సన్నీ లియోన్ భర్తకే ఝలక్ ఇచ్చిన ముంబై వ్యక్తి.. షాక్ అయిన పోలీసులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Sunny leone: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబెర్‌‌కు ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఊహించని షాక్ ఇచ్చాడు. ఏకంగా డేనియల్..

Sunny leone: సన్నీ లియోన్ భర్తకే ఝలక్ ఇచ్చిన ముంబై వ్యక్తి.. షాక్ అయిన పోలీసులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Follow us
Shiva Prajapati

| Edited By: Anil kumar poka

Updated on: Feb 25, 2021 | 4:37 PM

Sunny leone: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబెర్‌‌కు ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఊహించని షాక్ ఇచ్చాడు. ఏకంగా డేనియల్ వెబర్‌ కారు నెంబర్‌ నే తన కారు నెంబర్‌గా మార్చుకున్నాడు. అలా ముంబై నగరంలో విచ్చలవిడిగా తిరిగి చలాన్లు మోపెడు చేసి పెట్టాడు. దాంతో డానియల్ వెబర్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది.

వివరాల్లోకెళితే.. డేనియల్ వెబర్‌కు చెందిన వెహికిల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను తన మెర్సిడెస్ కారుకు ఉపయోగించినందుకు గానూ ఒక వ్యక్తిని ముంబైలోని వెర్సోవా పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. ముంబై ట్రాఫిక్ డీసీపీ యశస్వీ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 2020లో సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబెర్ పలుమార్లు రహదారి భద్రతా ఉల్లంఘనకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ మేరకు డేనియల్ వెబర్‌కు పోలీసులు చలాన్లు కూడా పంపించారు. అయితే, వాస్తవానికి ఈ చలాన్లకు కారణం పీయూష్ సేన్.

అసలేం జరిగిందంటే.. మంగళవారం డేనియల్ వెబెర్ డ్రైవర్ అక్బర్ ఖాన్ అంధేరిలోని అచ్యుత్రావ్ పట్వర్ధన్ మార్గ్‌లో ఓ కారును చూశాడు. ఆ కారు నెంబర్ అచ్చంగా డేనియల్ వెబెర్ కారు నెంబర్ కావడంతో షాక్‌కు గరయ్యాడు. వెంటనే డీఎన్ నగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ అకుష్‌ నిర్భావనేకు విషయం చెప్పాడు. డేనియల్ వెబర్ కారు నెంబర్‌ను మరో వ్యక్తి ఉపయోగిస్తున్నాడంటూ ఫిర్యాదు చేశాడు. దాంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ అకుష్ నిర్భావనే సదరు కారు వద్దకు వెళ్లాడు. కారు ఓనర్ అయిన పీయూష్ సేన్‌ను పత్రాలు చూపించమని కోరాడు. దాంతో సేన్ కారు పత్రాలు చూపించగా.. కారుకు ఉన్న నెంబర్, రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉన్న వివరాలు పూర్తి విరుద్ధంగా ఉండటాన్ని గమనించారు. దాంతో అతన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తరువాత సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబెర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. కారు రిజిస్ట్రేష్, చాసిస్ నెంబర్ వివరాలను పోలీసులకు చూపించాడు. పోలీసులు తమదైన స్టైల్‌లో సేన్‌ను విచారించగా.. వాస్తవం అంగీకరించాడు. పలువురు ప్రముఖులకు చెందిన కార్ల నెంబర్లను వాడుతున్నట్లు అంగీకరించాడు. దాంతో పోలీసులు పీయూష్ సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

చీటింగ్‌కు పాల్పడిన పీయూష్ సేన్‌పై మోటార్ వెహికల్ యాక్ట్ 139తో పాటు, ఐపీసీ సెక్షన్ 420, 465, 468 కింద కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ డీసీపీ యశస్వీ యాదవ్ తెలిపారు.

Also read:

ప్రియాంకా చోప్రను ట్రోల్ చేస్తున్న నెటిజనులు.. థ్యాంక్స్ చెప్పి షాక్ ఇచ్చిన గోబల్ బ్యూటీ.. ఇంతకు ఏమైందంటే..

ఊహ తెలియని వయసులోనే స్టార్‌డమ్, ప్రపంచాన్ని అర్థం చేసుకునేలోపే అనంతలోకాలకు పయనం.. దివ్యభారతి జయంతి ఈరోజు..

ఇంటిముందు పుర్రెతో క్షుద్రపూజల కలకలం.. భయానకం.. వైరలవుతున్న ఫోటోలు