TV9 Telugu Exclusive: ఈనెల 8న వెఎస్ షర్మిల తెలంగాణలో ప్రారంభించబోయే పార్టీ జెండా ఇదే..?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు షర్మిల హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. గత ఫిబ్రవరి నుంచి ఆమె పార్టీ ఏర్పాటుకు ముమ్ముర కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో...
(శ్రావణి, టీవీ9 తెలుగు, హైదరాబాద్)
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు షర్మిల హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. గత ఫిబ్రవరి నుంచి ఆమె పార్టీ ఏర్పాటుకు ముమ్ముర కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామనే నినాదంతో ముందకు వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేశారు. నిరుద్యోగుల సమస్యపై దీక్ష కూడా చేశారు. కాగా జులై 8 వైయస్సార్ జయంతి సందర్భంగా పార్టీని లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని పేరు కన్ఫామ్ చేశారు. పార్టీ విధి విధానాలు కూడా జులై 8న తెలియనున్నాయి. ఈ క్రమంలో పార్టీ జెండా గురించి లీకులు అందుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట రంగు 80 శాతం, 20 శాతం నీలం రంగుతో పార్టీ జెండా రూపొందించినట్లు పార్టీ వర్గాలు నుంచి సమాచారం అందుతోంది. జెండా మధ్యలో తెలంగాణ భౌతిక స్వరూపం, అందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రం ఉండేలా డిజైన్ చేశారు.
తెలంగాణలో పాలపిట్టకు అత్యంత ప్రాధాన్యం ఉంది. దసరా రోజున పాలపిట్టను చూడటం అనాదిగా వస్తున్న ఆచారం. ఎప్పుడో గానీ కనిపించని ఈ అరుదైన పక్షి.. విజయ దశమి నాడు కచ్చితంగా దర్శనమివ్వడం మరో ప్రత్యేకత. ఈ పర్వదినం రోజున ఊరు శివార్లలోని పంట పొలాల్లో తళుక్కున మెరిసి జనాలకు ఆహ్లాదాన్ని పంచుతుంది ఈ పక్షి. తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను శుభాలకు, విజయాలకు చిహ్నంగా భావిస్తారు. దసరా రోజున పాలపిట్టను చూడటాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు.
ఈ నెల 8న వైఎస్ షర్మిల పార్టీ ఆవిర్భావం.. రోడ్డు మ్యాప్ ఇదే
ఈ నెల 8వ తేదీన వైఎస్ షర్మిల బెంగళూరు నుంచి బైరోడ్డు ఇడుపులపాయకు చేరుకోనున్నారు. జూలై 8వ తేదీ ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయలో ప్రార్థనలు చేసిన అనంతరం కడప నుంచి ప్రత్యేక చాపర్‌లో 2 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పంజాగుట్ట చౌరస్తాలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్ షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు JRC కన్వెన్షన్‌కు చేరుకొని.. 5 గంటలకు వైఎస్ షర్మిల పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నారు.
Also Read: దేవత విగ్రహంపై పడగ విప్పిన ఆడిన నాగు పాము.. గంట పాటు పూజలు చేసినా…