AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జనాభాను అదుపు చేయండి..ముస్లిములకు అస్సాం సీఎం హితవు…బలవంతం చేస్తే అంగీకరించబోమన్న ముస్లిం సంస్థ

జనాభాను అదుపు చేయడానికి ముస్లిములు తగిన మార్గాలను అన్వేషించాలని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కోరారు. మీ సంక్షేమ చర్యలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అదే సమయంలో మీరు కూడా ఇందుకు యత్నించాలని ఆయన అన్నారు. తమ రాష్ట్రంలోని ముస్లిములను...

జనాభాను అదుపు చేయండి..ముస్లిములకు అస్సాం సీఎం హితవు...బలవంతం చేస్తే అంగీకరించబోమన్న ముస్లిం సంస్థ
Muslims To Find Ways To Control Population Says Asam Cm Himanta Biswa Sharma
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 05, 2021 | 6:30 PM

Share

జనాభాను అదుపు చేయడానికి ముస్లిములు తగిన మార్గాలను అన్వేషించాలని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కోరారు. మీ సంక్షేమ చర్యలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అదే సమయంలో మీరు కూడా ఇందుకు యత్నించాలని ఆయన అన్నారు. తమ రాష్ట్రంలోని ముస్లిములను ఆయన ‘అస్సామీ ముస్లిములు’గా అభివర్ణించారు. సుమారు 150 మంది ముస్లిం మేధావులు, రైటర్లు, డాక్టర్లు, చరిత్రకారులు, కళాకారులతో ఆయన నిన్న దాదాపు 2 గంటలపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. జనాభా అదుపులో సహకరించాలన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ముస్లిముల జనాభా పెరిగిపోయిందని…దీనివల్ల రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు కూడా ముప్పు ఏర్పడిందని ఆయన చెప్పారు. దేశం లోని 5 టాప్ రాష్ట్రాల్లో అస్సాం కూడా ఒకటి కావాలంటే మన జనాభాను కంట్రోల్ లో ఉంచుకోవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు ఆరోగ్యం, విద్య, కల్చరల్ ఐడెంటిటీ, మహిళా సాధికారత తదితర సమస్యలపై రోడ్ మ్యాప్ ను రూపొందించాలని కోరారు. ఇందుకు 8 సబ్ గ్రూపులను ఏర్పాటు చేసినట్టు ఆయన ఆ తరువాత తెలిపారు.

ఈ గ్రూపులు ఈ అంశాలపై సమగ్రంగా చర్చించి వచ్చే ఐదేళ్లకు రోడ్ మ్యాప్ ను ప్రిపేర్ చేస్తే సముచితంగా ఉంటుందన్నారు. ఈ సమావేశానికి పొలిటికల్ పార్టీలను ఆహ్వానించలేదని.. నేతలతో తాను తరువాత చర్చిస్తానని హిమంత బిశ్వ శర్మ చెప్పారు. అస్సాంలో ఈయన ప్రభుత్వం ‘ఇద్దరు బిడ్డల పాలసీని’ పాటిస్తున్న సంగతి విదితమే..అయితే ఈ పాలసీని బలవంతంగా అమలు చేయజూస్తే తాము దీన్ని అంగీకరించబోమని ఈ రాష్ట్ర జమియత్ ఉలామా నేత మౌలానా ఫజ్ లుర్ కరీం కాశ్మి పేర్కొన్నారు. ఇస్లాం కూడా జనాభా అదుపును కోరుతోందని..కానీ బలవంతంగా కాకుండా దీన్ని ప్రోత్సహించే విధంగా ఉండాలని సూచిస్తోందని ఆయన చెప్పారు. బర్త్ కంట్రోల్ పాలసీలను మైనారిటీలకే కాక..మెజారిటీ వర్గాలకు కూడా వర్తింప జేయాలని ఆయన అన్నారు. ఈ వర్గాలకు బర్త్ కంట్రోల్ పై ఓ చట్టం ఉండాలన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: రంగంలోకి దిగిన యాక్షన్ కింగ్..!సర్కారు వారి పాటకు స్పెషల్ అట్రాక్షన్ నిలవనున్న అర్జున్ :Arjun in Sarkaru Vaari Paata video.

హీరోయిన్ మెహరీన్‌ల,భవ్య ల ఎంగేజ్‌మెంట్‌ బ్రేకప్ అందుకేనా… ఇంస్టాగ్రామ్ నుండి పోస్టులు డిలీట్ :Mehreen Bhavya Bishnoi video.

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల సమీపంలో క్షుద్రపూజల కలకలం..!ఆలస్యంగా వెలుగులోకి వీడియో:Black Magic viral video.

కింగ్ కోబ్రా స్నేక్ సీక్రెట్స్ మీకు తెలుసా..?అత్యంత పొడవైన పాము గురించి ఆసక్తికర విషయాలు..వీడియో :King Cobra Video.