అదే తెలిసుంటే.. సన్నీకి అడ్డుపడేవాడ్ని: ధర్మేంద్ర షాకింగ్ కామెంట్స్
ఇటీవల బీజేపీలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి, సీనియర్ నటుడు ధర్మేంద్ర మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి సునీల్ జఖర్ బరిలో ఉన్నాడన్న విషయం తనకు ముందే తెలిసుంటే.. సన్నీని పోటీ చేయనిచ్చేవాడిని కాదని అన్నారు. సునీల్ తండ్రి బల్‌రామ్ జఖర్ తనకు సోదరుడిలాంటి వాడని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అంతేకాకుండా సునీల్ అనుభవఙ్క్షుడైన రాజకీయ నాయకుడని.. […]

ఇటీవల బీజేపీలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి, సీనియర్ నటుడు ధర్మేంద్ర మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి సునీల్ జఖర్ బరిలో ఉన్నాడన్న విషయం తనకు ముందే తెలిసుంటే.. సన్నీని పోటీ చేయనిచ్చేవాడిని కాదని అన్నారు. సునీల్ తండ్రి బల్‌రామ్ జఖర్ తనకు సోదరుడిలాంటి వాడని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
అంతేకాకుండా సునీల్ అనుభవఙ్క్షుడైన రాజకీయ నాయకుడని.. అలాంటి వ్యక్తితో సన్నీ ఢీ కొనలేడని పేర్కొన్నాడు. అయినా తాము సినీ ఇండస్ట్రీకి చెందిన వారమని.. అయినాప్రజలకు సేవ చేసేందుకు వచ్చాం తప్ప.. పబ్లిసిటీ కోసం కాదని ధర్మేంద్ర చెప్పుకొచ్చాడు. కాగా ఈ నెల 19న చివరి దశ ఎన్నికల్లో భాగంగా గుర్‌దాస్‌పూర్ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది.