ఓటు వేయని డిగ్గీరాజా.. శివరాజ్ సింగ్ ఎద్దేవా

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆదివారం జరిగిన ఆరో విడత పోలింగ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఓటు వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. దిగ్విజయ్ ఓటు హక్కు వినియోగించుకోవడంపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటు వేయాలన్న బాధ్యత మరిచి దిగ్విజయ్ వింతగా ప్రవర్తించారంటూ ఆయన దుయ్యబట్టారు. డిగ్గీ రాజా ప్రవర్తన వింతగా ఉందని.. ఓటు వేయడానికి వెళ్లేందుకు కూడా ఆయన తెగ […]

ఓటు వేయని డిగ్గీరాజా.. శివరాజ్ సింగ్ ఎద్దేవా
Follow us

| Edited By:

Updated on: May 13, 2019 | 1:51 PM

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆదివారం జరిగిన ఆరో విడత పోలింగ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఓటు వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. దిగ్విజయ్ ఓటు హక్కు వినియోగించుకోవడంపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటు వేయాలన్న బాధ్యత మరిచి దిగ్విజయ్ వింతగా ప్రవర్తించారంటూ ఆయన దుయ్యబట్టారు. డిగ్గీ రాజా ప్రవర్తన వింతగా ఉందని.. ఓటు వేయడానికి వెళ్లేందుకు కూడా ఆయన తెగ భయపడిపోయారని ఎద్దేవా చేశారు. ప్రజా స్వామ్యంలో ఓటు వేయడం తప్పనిసరి బాధ్యతని.. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ వ్యక్తి ఓటు వేయడంలో విఫలమవ్వడం చూస్తే.. ప్రజాస్వామ్యం పట్ల ఆయన వైఖరి ఏంటో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.

కాగా, సీఎం కమల్‌నాథ్‌పై డిగ్గీ రాజాకు నమ్మకం లేకపోవడం కూడా మరో కారణమని తాను భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. భోపాల్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి దిగ్విజయ్ పోటీచేస్తున్నారు. అయితే రోజంతా భోపాల్‌లో పోలింగ్ బూత్‌ల వద్ద తిరగడంతో… సమయానికి రాజ్‌ఘడ్‌కి చేరుకోలేకపోయారు. ఓటు వేయలేకపోవడం బాధగా ఉందనీ.. వచ్చే ఎన్నికల నాటికి భోపాల్‌లోనే తన ఓటు నమోదు చేసుకుంటానని డిగ్గీ రాజా పేర్కొన్నారు.