మీ చేతిలో ఫోన్ పదే పదే పగిలిపోతుందా.. అయితే ఈ వాస్తు దోషమేనేమో..
Samatha
28 December 2025
మొబైల్ ఫోన్ లేకుండా ఎవరు ఉంటారు చెప్పండి. చిన్న పిల్లలనుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్‌కు అడక్ట్ అయిపోయారు.
రోజు రోజుకు మొబైల్ ఫోన్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అయితే కొంత మంది చేతిలో ఫోన్ పదే పదే పగిలిపోతుంది.
దీంతో వారు తమ ఫోన్‌ను గ్లాస్ వేయిస్తూ, వస్తుంటారు, కొంత మంది ఫోన్ పగలగొట్టు కోవడం, కొత్త ఫోన్ కొనుగోలు చేయడం చేస్తుంటారు
అయితే చేతిలో ఒకటి రెండు సార్లు కాకుండా, పదే పదే ఫోన్ పగలడానికి కారణం వాస్తు దోషమే అంటున్నారు నిపుణులు. కాగా, దీని గురించి తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహు గ్రహ ప్రతికూల ప్రభావం కారణంగా మొబైల్ ఫోన్ అనేది పదే పదే పగిలిపోతుందంట. రాహు గ్రహం ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రభావం చూపుతాడు.
ఎవరి జాతకంలో అయితే రాహు బలహీనంగా ఉంటాడో, వారిలో ఏకాగ్రత తగ్గి చేతి పట్టు సడలి, ఫోన్ పదే పదే కిందపడి పగిలిపోతుందంట.
స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ ఇతర ఏ ఎలక్ట్రానిక్ వస్తువులపైన అయినా సరే దీని ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుందంట.
అందుకే ఎవరి జాతకంలో అయితే రాహు బలహీనంగా ఉంటాడో, వారు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండటం, దోష నివారణ చేయించుకోవడం ఉత్తమం.