మెగాస్టార్ వెర్సస్ పవర్‌స్టార్.. అసలు ఏమైంది!
చిరంజీవి వర్సెస్ పవన్ కళ్యాణ్..అన్నయ్యకి,తమ్ముడికి మధ్య మళ్లీ ఏం జరిగిందని అనుకుంటున్నారా..? ఇది అన్నదమ్ముల రగడ కాదు. వారి అభిమానుల మధ్య రేగిన చిచ్చు. భీమవరంలో ఓడిపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కేడర్ ని ఉద్దేశించి స్పీచ్ కూడా ఇచ్చారు. అయితే పవన్ కేడర్ గురించి కాదు.. చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడారంటూ మెగాస్టార్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. అయితే చిరంజీవిని ఉద్దేశించి ఎలాంటి టాపిక్ లేదంటూ పవర్‌స్టార్ ఫ్యాన్స్ […]
చిరంజీవి వర్సెస్ పవన్ కళ్యాణ్..అన్నయ్యకి,తమ్ముడికి మధ్య మళ్లీ ఏం జరిగిందని అనుకుంటున్నారా..? ఇది అన్నదమ్ముల రగడ కాదు. వారి అభిమానుల మధ్య రేగిన చిచ్చు. భీమవరంలో ఓడిపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కేడర్ ని ఉద్దేశించి స్పీచ్ కూడా ఇచ్చారు. అయితే పవన్ కేడర్ గురించి కాదు.. చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడారంటూ మెగాస్టార్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. అయితే చిరంజీవిని ఉద్దేశించి ఎలాంటి టాపిక్ లేదంటూ పవర్‌స్టార్ ఫ్యాన్స్ రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ భీమవరంలో ఏమన్నారు..ఫ్యాన్స్ ఎలా అర్థం చేసుకున్నారు?
అసలు విషయం ఏంటంటే.. ప్రాణం పోయినా సరే.. ఏ పార్టీలోనూ జనసేనను విలీనం చేయనని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ మాటలకే చిరంజీవి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఇక పీఆర్పీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ప్రాణం పోయినా సరే అనే పదాన్ని వాడాల్సిన అవసరమేంటి అని చిరు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ లో కలిపివేశారని.. పవన్ తన మాటల్లో గుర్తు చేయడమే కదా అంటూ భగ్గు మంటున్నారు.