AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ, వైసీపీ మధ్యలో “కియా” వార్

ఏపీలో కియా కార్ల టాపిక్ హాట్‌గా మారింది. ఏపీలో తయారైన తొలికారు కియా. అనంతపురం ప్లాంట్‌ నుంచి తయారు చేసిన సెల్టో కారును ఇప్పుడు గ్రాండ్‌గా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. అయితే ఈ కియా ఘనత తమదంటే తమదంటూ నేతలు కామెంట్లు మొదలుపెట్టారు. ఈ ఏడాది జనవరి 29న ఇదే కియా మోటార్స్‌కి చెందిన ఇదే అనంతపురం ప్లాంట్‌లో తయారైన తొలి కారుతోనే ట్రయిల్ రన్‌ చేశారు నాటి సీఎం చంద్రబాబు. స్వయంగా కారు నడుపుతూ బాబు […]

టీడీపీ, వైసీపీ మధ్యలో కియా వార్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 10, 2019 | 10:04 PM

Share

ఏపీలో కియా కార్ల టాపిక్ హాట్‌గా మారింది. ఏపీలో తయారైన తొలికారు కియా. అనంతపురం ప్లాంట్‌ నుంచి తయారు చేసిన సెల్టో కారును ఇప్పుడు గ్రాండ్‌గా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. అయితే ఈ కియా ఘనత తమదంటే తమదంటూ నేతలు కామెంట్లు మొదలుపెట్టారు. ఈ ఏడాది జనవరి 29న ఇదే కియా మోటార్స్‌కి చెందిన ఇదే అనంతపురం ప్లాంట్‌లో తయారైన తొలి కారుతోనే ట్రయిల్ రన్‌ చేశారు నాటి సీఎం చంద్రబాబు. స్వయంగా కారు నడుపుతూ బాబు ఫోటోలకు ఫోజుచ్చారు. అయితే అప్పుడు బాబు లాంఛ్ చేసింది కియా ఫస్ట్ కారా… లేదా ఇప్పుడు జగన్ రిలీజ్ చేసిందే తొలి కియా కారా.. అనేది ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రతీ కంపెనీకి తొలి కారు అంటూ ఒకటే ఉంటుంది కదా. ఇప్పుడు మార్కెట్లోకి విడుదల అయిన సెల్టో కారే తొలి కారు అయితే… మరి నాడు చంద్రబాబు ట్రయిల్‌ రన్‌ చేసిన కారు ఎక్కడ తయారైంది అన్న చర్చ మొదలైంది. కియా మోటార్స్‌ తొలి కారు విడుదల కాగానే…మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ట్విట్టర్‌‌లో స్పందించారు. కష్టపడేది ఒకరు…రిబ్బన్‌ కట్‌ చేసేది ఇంకొకరు అంటూ ట్విట్టర్ వేదికగా వైసీపీ మీద సెటైర్‌ వేశారు. దీంతో అటు వైసీపీ నేతలు డైరెక్ట్‌గానే విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా కియా మీద ట్వీట్‌ చేశారు. దేశంలోనే మొదటి కియా ప్లాంటు నుంచి తొలి కారు విడుదల సందర్భంగా ఏపీ ప్రజలకు అభినందనలు తెలిపారు. చంద్రబాబు కూడా ఇదే తొలి కారు అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

Follow Us
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన