బెంగాల్‌లో కొనసాగుతున్న ప్రతికార దాడులు.. మమతా మేనల్లుడిని చెంపదెబ్బ కొట్టిన దేబాషిష్ హత్య..
ఎన్నికల ప్రచారంలో సమయంలో వేదికపై ఉన్న అభిషేక్ బెనర్జీని చెంపదెబ్బ కొట్టిన దెవాషిష్ ఆచార్య ఆ తర్వాత టీఎంసీ మద్దతుదారులు అతన్ని కొట్టి చంపినట్లుగా తెలుస్తోంది.
బెంగాల్‌లో ప్రతికార దాడులు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల 2021 సందర్భంగా బిజెపి నాయకుడు దేబాషిష్ ఆచార్య గురువారం రాత్రి హత్యకు గురయ్యాడు. గురువారం రాత్రి ఆయనపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. తలకు తీవ్ర గాయాలు కావడంతో మరణించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు. ఈ హత్యపై సిబిఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేసింది.
ఓ రాజకీయ సమావేశం పాల్గొనేందుకు వచ్చిన మమతా మెనళ్లుడు అభిషేక్ బెనర్జీని చెంపదెబ్బ కొట్టడంతో అది పెద్ద సంచలనంగా మారింది. చెంపదెబ్బ కొట్టిన దేవాషిష్ ఆచార్య ఇప్పుడు హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత కొంత కాలం ఈ కేసు కొనసాగింది. ఆ సమయంలో దేవాషీష్ క్షమాపనలు కూడా కోరినట్లుగా సమాచారం. ఎన్నికల ప్రచార సమావేశంలో ఈ ఘటన జరిగింది
ఆ ఘటన జరిగిన దృశ్యాలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దేబాషిష్ చెంపదెబ్బ కొట్టిన తరువాత వేదికపై ఉన్న కొంతమంది వ్యక్తులు అతడిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో దేవాషీష్ తీవ్రంగా గాయపడ్డాడు.
రాష్ట్రంలో ఇప్పుడు ఇలా…
మమతా సర్కార్‌ను గద్దె దించేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బిజెపి బెంగాల్ ఇన్‌ఛార్జి కైలాష్ విజయవర్గియా మాట్లాడుతూ… ఈ రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 48 మంది బిజెపి కార్యకర్తలు మరణించారని… మరోవైపు, బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారుల పెరిగిపోయాయని అన్నారు. రాష్ట్రంలో అత్యాచార సంఘటనలు రోజు రోజుకు వేగంగా పెరుగుతున్నాయన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా కుప్పకూలిందని జాతీయ ప్రధాన కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు. దాడుల ఘటనలపై పోలీసులు కనీసం కేసులు కూడా నమోదు చేయడంలో లేదని అన్నారు. రాష్ట్రంలో అరాచకం వేగంగా వ్యాపిస్తోందని, అయితే కొద్ది రోజుల క్రితమే ప్రజాభిప్రాయంతో ప్రభుత్వం ఏర్పడిందని, కాబట్టి రాష్ట్రపతి పాలన విధించడం ఇప్పుడు సముచితం కాదని ఆయన అన్నారు.