MP Vijayasai Reddy: ఆనందయ్య మందుతో ఎలాంటి ఇబ్బందీ లేదు.. విశాఖ ఫ్రంట్ లైన్ వర్కర్లకు మందు అందించిన ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆనందయ్య మందును విజయసాయిరెడ్డి పంపిణీ చేశారు.

MP Vijayasai Reddy: ఆనందయ్య మందుతో ఎలాంటి ఇబ్బందీ లేదు.. విశాఖ ఫ్రంట్ లైన్ వర్కర్లకు మందు అందించిన ఎంపీ విజయసాయిరెడ్డి
Ycp Mp V Vijayasai Reddy Distribution Of Anandayya Medicine

YCP MP V Vijayasai Reddy Distribution of Anandayya Medicine: కరోనా నుంచి కాపాడుకునేందుకు.. ప్రజలందరికీ ఆనందయ్య మందు అందిస్తామని పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆనందయ్య మందును విజయసాయిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా కట్టడికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టుదిట్టడమైన చర్యలు తీసుకుంటోందని ఎంపీ తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కరోనా నియంత్రణ చర్యలు సీఎం జగన్ చేపట్టారు.

కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్ వర్కర్స్ 22 వేలమంది ప్రాణాలకు తెగించి విశాఖలో పని చేశారన్నారు. ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడాకుంటామన్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుల వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదని తేలిందన్నారు. మొదటి దశలో 22 వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు అందిస్తున్నామన్నారు. రెండవ విడతలో జిల్లాలో ఉన్న ప్రజలందరికీ ఆనందయ్య మందు ఉచితంగా అందిస్తామన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Read Also… 

Covid-19 Hospital: పిల్లల కోసం కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయండి.. డీఆర్‌డీఓకు వీహెచ్‌పీ వినతి

MLC Srinivas Reddy Corona kit: ‘ఇంట్లోనే ఉందాం.. క్షేమంగా ఉందాం’.. మెడికల్ కిట్‌తో పాటు మందు బాటిల్.. ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్సీ నజరానా!