AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Job Calendar 2021: ఏపీ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. జాబ్‌ క్యాలెండర్ విడుద‌ల

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మరో మేజ‌ర్ స్టెప్ వేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నిరుద్యోగ యువతకు తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలో మరిన్ని ఉద్యోగాల...

AP Job Calendar 2021: ఏపీ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. జాబ్‌ క్యాలెండర్ విడుద‌ల
Ap Job Calendar
Ram Naramaneni
|

Updated on: Jun 18, 2021 | 1:52 PM

Share

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మరో మేజ‌ర్ స్టెప్ వేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నిరుద్యోగ యువతకు తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. 2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ను సీఎం జగన్‌ విడుదల చేశారు. దేవుని దయతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్ ప్రకటించామ‌న్నారు. 2021-22 ఏడాదికి 10,143 ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు ఉంటాయన్నారు. అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని చెప్పారు. రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేస్తామని.. ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగాల భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఏ ఉద్యోగం ఏ నెలలో వస్తుందో తెలియజేసేందుకు క్యాలెండర్‌ తెస్తున్నామని సీఎం జగన్​ అన్నారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని జగన్‌ గుర్తు చేశారు. ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదన్నారు. వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా 2.50లక్షలకు పైగా నిరుద్యోగులకు ఆస‌రా క‌ల్పించామ‌న్నారు. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్పటివరకు 6 లక్షల 3 వేల 756 ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం జగన్‌ వివరించారు.

దళారీ వ్యవస్థ లేకుండా ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామ‌ని సీఎం చెప్పారు. మినిమమ్‌ టైం స్కేల్‌తో కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జీతాలు పెంచామ‌న్నారు. 51 వేల 387 మంది ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించామని వెల్ల‌డించారు. ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామ‌న్నారు సీఎం జ‌గ‌న్. ప్యాకేజీ, ఓటుకు కోట్లు కేసు కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ముఖ్య‌మంత్రి విమర్శించారు.

Also Read: మడ్‌ పడ్లింగ్ చేస్తోన్న సీతాకోక‌చిలుక‌లు.. దీన్ని చూడండి అచ్చం ఆకులాగే ఉంది..

 ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. కర్ఫ్యూ వేళల నిబంధనలు సడలింపు.. ఈనెల 21 నుంచి అమలు