AP Curfew: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. కర్ఫ్యూ వేళల నిబంధనలు సడలింపు.. ఈనెల 21 నుంచి అమలు

AP Lockdown: కరోనా కట్టడికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ  కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ 30 వరకు కర్ఫ్యూ..

AP Curfew: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. కర్ఫ్యూ వేళల నిబంధనలు సడలింపు.. ఈనెల 21 నుంచి అమలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 18, 2021 | 7:19 PM

AP Curfew: కరోనా కట్టడికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ  కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ 30 వరకు కర్ఫ్యూ నిబంధనల్లో ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 గంటల నుంచి మాధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఇచ్చింది. కోవిడ్‌ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 మాత్రమే సడలింపు ఉంది. ఈనెల 21 నుంచి నిబంధనలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. యథావిధిగా ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని తెలిపింది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.

అయితే రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేసింది ప్రభుత్వం. కర్ఫ్యూ సడలింపులు పెంచినప్పటికీ ప్రజలు మాస్కులు ధరించడం, దుకాణాలు, మార్కెట్ల వద్ద భౌతిక దూరం పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఇలాగే లాక్‌డౌన్‌, కర్ఫ్యూ సడలింపులు ఇస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇక తెలంగాణలో కూడా సడలించిన లాక్‌డౌన్‌ ఆంక్షలు 19వ తేదీలో ముగియనుంది. అయితే తెలంగాణలో పూర్తిగా లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం రాత్రి వేళల్లో మాత్రమే కర్ఫ్యూ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా, కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా వేగవంతం చేస్తోంది. మాస్క్‌లు లేకుండా బయటకు వచ్చేవారికిపై చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. గతంలో 25 వేల వరకు నమోదైన కేసులు ఇప్పుడు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 6 వేల వరకు పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,32,902కి చేరింది. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు కూడా అధికంగా నమోదు కావడంతో కాస్త ఊపశమనం కలిగిస్తోంది.

ఇవీ కూాడా చదవండి:

Devineni Uma: దేవినేని ఉమపై కృష్ణా జిల్లాలో కేసు నమోదు.. కరోనా కట్టుబాట్లను ఉల్లంఘించారని ఆరోపణ

Megastar Chiranjeevi: అభిమానికి చిరు ఫోన్.. త‌న మ‌న‌సుకు ఎంతో ఆనందంగా ఉంద‌న్న మెగాస్టార్

పీఎఫ్ ఖాతాదారులకు గమనిక.. ఈ ఐదు మార్పుల గురించి తప్పక తెలుసుకోండి.!